
‘కుట్రపూరితంగానే లాభాల జాప్యం’
శ్రీరాంపూర్: కుట్రపూరితంగానే కంపెనీ వాస్తవ లాభాలు ప్రకటించడం లేదని టీబీజీకేఎస్ కేంద్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. శనివారం ఆర్కే న్యూటెక్ గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ కంపెనీకి ఎన్ని లాభాలు వచ్చాయో ప్రకటించలేదన్నారు. గత సంవత్సరం లాభాలను తక్కువ చేసి చూపించిన తర్వాత వాటా పంపిణీ చేశారని, నేడు అదే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవ లాభాలు ప్రకటించి అందులో నుంచి 35 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో ప్రకటించకపోతే జీఎం కార్యాలయాల ఎదుట బతుకమ్మ ఆడుతూ నిరసన తెలుపుతామన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరారు. యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, కేంద్ర కమిటీ నాయకులు పానుగంటి సత్తయ్య, పెట్టం లక్ష్మణ్, పొగాకు రమేశ్, అన్వేష్‌రెడ్డి, ఎండీ లాల, డివిజన్ నాయకులు సాదుల భాస్కర్, వెంగళ కుమార్ స్వామి, సంపత్, జైపాల్‌రెడ్డి, దేవేందర్, తిరుపతిరావు, అశోక్, పిట్ సెక్రెటరీలు రాజు నాయక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.