
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
దిలావర్‌పూర్: మండలంలోని సిర్గాపూర్ సమీపంలో నిర్మల్–భైంసా రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్సై రవీందర్ కథనం ప్రకారం.. మండలంలోని న్యూలోలం గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (40) నిర్మల్ వెళ్లి రాత్రి స్వగ్రామానికి బైక్‌పై వస్తున్నాడు. సిర్గాపూర్ వద్ద ఐరన్ లోడ్‌తో ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టాడు. హుస్సేన్ తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి అతన్ని అంబులెన్స్‌లో నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికి పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అనుమానాస్పద స్థితిలో ఒకరు..
ఆదిలాబాద్‌రూరల్: అనుమానాస్ప స్థితిలో ఒకరు మృతి చెందినట్లు ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని అనుకుంట గ్రామానికి చెందిన మన్నె అశోక్ (50) వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. గత 20 రోజులుగా ఛాతీనొప్పితో బాధపడుతున్నాడు. మూడు రో జులుగా కూలీ పనుల్లో భాగంగా గడ్డి మందు పిచికారీ చేశాడు. శుక్రవారం రాత్రి ఇంటి వద్ద వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబీకులు వెంట నే రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించా రు. మృతదేహాన్ని ఎస్సై శనివారం పరిశీలించి పంచనామా నిర్వహించారు. భా ర్య సంగీత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
దరఖాస్తు చేసుకోవాలి
మంచిర్యాలటౌన్: ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకం కింద పేద ముస్లిం మహిళలకు మోపెడ్ బైక్/ఈ–బైక్, రూ.50 వేల ఆర్థికసాయం కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నీరటి రాజేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. పేద మహిళలు, వితంతువులు, విడాకులు పొందిన వారు, అనాధలు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. రేవంత్ అన్నకా భరోసా మిస్కినో కే లియే పథకం కింద అందిస్తున్న మోపెడ్/ఈ–బైక్ కోసం అభ్యర్థులు ఫకీర్/దూదేకుల/బలహీన ముస్లిం వర్గానికి చెందిన వారై ఉండాలని పేర్కొన్నారు. tgobmms. cgg. gov. in వెబ్‌సైట్ ద్వారా అక్టోబర్ 6లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్ 85558 41417 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
మళ్లీ నిండింది.. ఖాళీ అవుతోంది
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇటీవల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరగా మరోసారి వర్షాలకు శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్ట్, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో మళ్లీ నిండింది. వరదను అంచనా వేస్తూ అధికారులు ఖాళీ చేసిన శనివారం ఉదయం వరకు 5 గేట్లకు కుదించినా భారీ వరదనీరు వస్తుండటంతో ప్రాజెక్ట్ నిండింది. నీటిమట్టం 20.175 టీఎంసీలతో నిండగా, సాయంత్రం నీటిని ఖాళీ చేయడం ప్రారంభించారు. ఇన్ ఫ్లో కింద 2.70 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతుండగా, ఔట్ ఫ్లో కింద హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 285 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ప్రాజెక్ట్‌లోని 62 గేట్లలో 30 గేట్లు తెరచి 3.20 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలిపెడుతున్నారు.
గేట్ల ఎత్తివేతతో గోదావరిలో కలుస్తున్న వరదనీరు

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి