
నాటుసారా కేంద్రాలపై దాడులు
చెన్నూర్‌రూరల్: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోటపల్లి మండలంలోని సిర్స, ఆలుగామ గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎకై ్సజ్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీ చేస్తున్న ఏడుగురిపై కేసు నమోదు చేసి, 23 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 1900 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు ఎకై ్సజ్ సీఐ ఎం.హరి తెలిపారు. జనవరి నుంచి ఇప్పటివరకు 234 కేసులు నమోదు చేసి 249 మందిని అరెస్టు చేయగా, 1289 లీటర్ల నాటుసారా, 30 వాహనాలు స్వాధీనం చేసుకుని, 4 వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 179 మందిని బైండోవర్ చేయగా, బైండోవర్ ఉల్లంఘించిన ఐదుగురికి రూ.3.50 లక్షల జరిమానా విఽ దించినట్లు తెలిపారు. ఎక్కువ కేసులు నమోదైనవారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు.
నాటుసారా పట్టివేత
చింతలమానెపల్లి: మండలంలోని లంబడిహెట్టి, రణవెల్లి గ్రామాల్లో శనివారం దాడులు చేసి నాటుసారాను పట్టుకున్నట్లు అబ్కారీ శాఖ సీఐ వి.రవి తెలిపారు. గ్రామశివారుల్లో 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 20 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. లంబడిహెట్టి గ్రామానికి చెందిన బానోత్ ధన్‌రాజ్ బైక్‌పై అక్రమంగా తరలిస్తున్న 10 లీటర్ల గుడుంబాను పట్టుకున్నామని తెలిపారు. ధనరాజ్‌పై కేసు నమోదు చేసి బైక్‌ను సీజ్ చేశామన్నారు. ఈ దాడుల్లో ఎస్సైలు లోభానంద్, సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.