
విద్యా కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్‌ఖిల్లా: రాష్ట్ర విద్యాశాఖ చేపట్టే విద్యా కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి సూచించారు. డీఈవో కార్యాలయంలో ఎంఈవోలతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఖాన్ అకాడమీ, ఐఎఫ్‌పీ ప్యానెల్స్, టాస్, ఉల్లాస్, ఉపాధ్యాయులు, విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు, పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, ఏఏపీసీ పనుల నిర్వహణ, గ్రంథాలయాల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, అన్నీ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఎంఈఓలు తమ మండల పరిధిలోని పాఠశాలల్లో 100 శాతం నమోదు పూర్తయ్యేలా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఈవో భోజన్న, జిల్లా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అధికారి జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.