భైంసాటౌన్: పెళ్లి పేరిట యువతిని ఓ దివ్యాంగుడి కి విక్రయించేందుకు యత్నించిన కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు భైంసా అదనపు ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకట న విడుదల చేశారు. వివరాలు.. కుభీర్ మండలం మార్లగొండకు చెందిన రాథోడ్ రామారావు అదే మండలంలోని సేవాదాస్‌నగర్‌కు చెందిన చౌహన్ లీ కూతురు (25)కు పెళ్లి సంబంధం పేరిట నమ్మించాడు. లోకేశ్వరం మండలానికి చెందిన వరుడు (ది వ్యాంగుడు)కు ఒక కాలు లేదని, అమ్మాయిని బాగా చూసుకుంటాడని నమ్మబలికాడు. దీంతో నమ్మిన యువతి కుటుంబీకులు ఈనెల 12న భైంసా పట్ట ణంలో పెళ్లి చూపులకు రాగా, వరుడు పూర్తి దివ్యాంగుడు కావడంతో యువతి పెళ్లికి నిరాకరించింది. అయితే, మధ్యవర్తిగా ఉన్న రాథోడ్ రామారావు రూ.లక్ష ఇప్పిస్తానని యువతి తండ్రిని ఒప్పించేందుకు యత్నించగా, అతను ససేమిరా అన్నాడు. అ యినా, రామారావు యువతిని బలవంతంగా వా హనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించగా, ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో రామారావు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మేరకు యువతి ఫిర్యా దు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేపట్టారు. శుక్రవారం రామారావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అదనపు ఎస్పీ పేర్కొన్నారు.
పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత
ఇచ్చోడ: మండల కేంద్రంలోని నిర్మల్ బైపాస్ వద్ద ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు పశువులను తీసుకెళ్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నా రు. పది పశువులను స్వాధీనం చేసుకుని స్థానిక జైశ్రీరాం గోశాలకు తరలించారు. ఎస్సై పురుషో త్తం తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనం శుక్రవారం ఉదయం నిర్మల్ బైపాస్ వద్ద వెనుక నుంచి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బొలెరో వాహనంలో పశువులు ఉన్న ట్లు గమనించారు. స్థానికులను చూసిన వాహన డ్రై వర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీ సులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాని కి చేరుకుని బొలెరో వాహనాన్ని పోలీస్టేషన్‌కు తరలించి పశువులను గోశాలకు అప్పగించినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఈ ఘటనలో బస్సు కండక్టర్‌కు స్వల్పగాయాలు కాగా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్టట్లు పేర్కొన్నారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
సారంగపూర్: మండలంలోని సాయినగర్ గ్రామానికి చెందిన లాల్‌సింగ్(47) శుక్రవారం రాధాస్వామి సత్సంగ్ బ్యాస్ ప్రాంగణం సమీపంలోని మర్రిచెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లాల్‌సింగ్ స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇటీవల భార్య శీతలకు ఆయనకు మధ్యలో కలహాలు తలెత్తాయి. రోజురోజుకూ గొడవలు తీవ్రం కావడంతో మనస్తాపం చెందిన లాల్‌సింగ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్సై శ్రీకాంత్‌కు స్థానికులు సమచారం అందించారు. పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు.
పేకాడుతున్న 10మందిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌లో పేకాడుతున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఆ కాలనీలోని ఓ ఇంట్లో పేకాడుతున్న ఐదుగురిని పట్టుకున్న ట్లు పేర్కొన్నారు. వారి నుంచి రూ.36,640 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలాగే, ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టర్‌చౌక్‌లోగల వజ్ర ఫంక్షన్‌హాల్ టెర్రస్‌పై పేకాడుతు న్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ తెలిపారు. వారి నుంచి రూ.470 స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి
రెబ్బెన: మండలంలోని నంబాలలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి అదే గ్రామానికి చెందిన గంగుల నాందేవ్ (35) అనే డ్రైవర్ మృతి చెందాడు. రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నాందేవ్ నంబాల గ్రామానికి చెందిన పూదరి బానేశ్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ట్రాక్టర్‌ను కడిగేందుకు గ్రామంలోని మన్నెగూడ సమీపంలోగల చెరువు వద్దకు అదే గ్రామానికి చెందిన ఎర్గటి రవితో కలిసి వెళ్లాడు. ఇద్దరు కలిసి ట్రాక్టర్‌ను కడిగిన తర్వాత తిరిగి గ్రామానికి వచ్చే క్రమంలో రవి ట్రాక్టర్ నడపగా నాందేవ్ పక్కన కూర్చున్నాడు. అయితే మార్గమధ్యలో రవి మలవిసర్జన కోసమని ట్రాక్టర్‌ను దారి పక్కన నిలిపి వెళ్లగా నాందేవ్ రవికి చెప్పకుండా ట్రాక్టర్ తీసుకునివెళ్లాడు. అయితే, మార్గమధ్యలోని జెడ్పీ హైస్కూల్ వద్ద్దకు చేరుకోగా రోడ్డుకు అడ్డంగా ఉన్న ముళ్ల చెట్టును తప్పించే క్రమంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి ట్రాక్టర్ పైనుంచి కిందపడ్డాడు. గమనించి పాఠశాల విద్యార్థులు విషయాన్ని ఉపాధ్యాయులకు తెలుపగా వారు గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో గ్రామానికి చెందిన బక్క రాకేశ్, పూదరి సన్నీ, పూదరి గణేశ్ ఘటనా స్థలానికి చేరుకుని నాందేవ్‌ను రెబ్బెన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి నాందేవ్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి అన్న పోశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న పశువులు
తరలిస్తున్న వాహనం