
ఆర్జీయూకేటీలో ఏఐపై ప్రత్యేక శిక్షణ
బాసర: బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయుకేటీ)లో టీజీఎఫ్‌డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్‌లతో కలిసి ప్రత్యేక ఇంటరా?క్టివ్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రపరిశ్రమలో కృత్రిమ మేధస్సు(ఏఐ) పాత్ర, సృజనాత్మకకథ, కథనం, నిర్మాణ సామర్థ్యం, కంటెంట్ డెలివరీలో దాని ప్రభావంపై చర్చించారు. అదే సమయంలో, ఐఈఈఈ విద్యార్థి శాఖ, ఈసీఈ విభాగం కార్యాలయం ప్రారంభించారు. దిల్ రాజు మాట్లాడుతూ చిత్ర నిర్మాణంలో ఏఐ పాత్రను వివరించారు. ఏఐ పరిశ్రమలో కొత్త అవకాశాలను సృష్టిస్తోందని తెలిపారు. విద్యార్థుల్లోని ప్రతిభను ఉపాధి అవకాశాలతో సమన్వయం చేయడానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
సాంకేతిక ఆవిష్కరణలకు వేదిక
ఈ సదస్సులో ఐఈఈఈ హైదరాబాద్ విభాగం సభ్యులు, ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్‌తోపాటు దిల్ రాజు ఐఈఈఈ ప్రపంచ ప్రభావం, సాంకేతిక పురోగతిపై చర్చించారు. 39 గ్లోబల్ సొసైటీలు, 20 సెక్షన్ల ద్వారా సాంకేతిక సహకారం, అభ్యాసాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఐఈఈఈ విద్యార్థి శాఖ కౌన్సిలర్ డాక్టర్ నామాని రాకేశ్, చైర్‌పర్సన్ జి.వంశీ శాఖ అభివృద్ధి కోసం తమ ప్రణాళికలను పంచుకున్నారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యులను పరిచయం చేస్తూ రాబోయే కార్యక్రమాల గురించి తెలియజేశారు.