
బాలికల కబడ్డీ జట్టు ఎంపిక
మందమర్రిరూరల్: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ మైదానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి బాలికల కబడ్డీ పోటీలు శుక్రవారం నిర్వహించారు. పోటీలను ఎస్సై రాజశేఖర్ ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల నుంచి సుమారు 80 మంది బాలికలు పాల్గొనగా జిల్లా స్థాయిలో 15 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు వి జయం సాధించాలని ఎస్సై, మోడల్‌స్కూల్ ప్రిన్సిపల్ సారా తస్లీమ్, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ బాబురావు ఆకాంక్షించారు.