
డీసీఎంఎస్ కేంద్రం గురించి..
తమ గ్రామపంచాయతీ పరిధికే డీసీఎంఎస్ కేంద్రాన్ని కేటాయించాలని కుంటాల మండలం అంబకంటితాండ వీడీసీ, గ్రామస్తులు కలెక్టర్‌కు విన్నవించారు. తమకు రావాల్సిన యూరియాతో సహా ఇతర ప్రయోజనాలను పొందాలంటే గ్రామానికే చెందిన వ్యక్తికి కేటాయించాలని వారు కోరారు.
ఇల్లు ఇప్పించండి..
తీసుకున్న అప్పునకు సంబంధం లేకుండా బాండ్ పేపర్ చూయిస్తూ తన ఇంటికి తాళాలు వేశారని, తమ ఇంటిని తమకు ఇప్పించేలా చూడాలని కడెం మండలం కొండుకూర్ గ్రామానికి చెందిన పాలకుర్తి రాంబాబు, కుటుంబసభ్యులు కలెక్టర్‌కు విన్నవించారు.
‘ఆరోగ్యశ్రీ’ వేతనాలు చెల్లించండి..
ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా వివిధ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న తమకు వేతనాలు రావడం లేదంటూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఉద్యోగులు కలెక్టర్‌కు విన్నవించారు. అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ ఎక్స్‌టెన్షన్ పీరియడ్‌ను పెంచి, సకాలంలో వేతనాలు ఇప్పించాలని కోరారు.

డీసీఎంఎస్ కేంద్రం గురించి..

డీసీఎంఎస్ కేంద్రం గురించి..