
దివ్యాంగులకు న్యాయ సేవల అండ
సోన్: మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక హాజరై మాట్లాడారు. దివ్యాంగ విద్యార్థులకు న్యాయ సేవా సంస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, అండగా నిలుస్తుందని తెలి పారు. తల్లిదండ్రులు తమ పిల్లల సమస్యలను న్యాయ సేవా సంస్థ దృష్టికి తీసుకురావాలని కోరా రు. దివ్యాగులకు అవసరమైన సౌకర్యాలను కల్పి స్తూ, వారి భవిష్యత్తుకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక వైద్యాధికారి విజయ్ కుమార్, ఎంఈవో పరమేశ్వర్ మాట్లాడుతూ, పిల్లలు పుట్టిన వెంటనే వారి వినికిడి శక్తి, నడక, చలన శక్తిని జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. అవసరమైన వారికి జిల్లాలోని డైస్ ద్వారా సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లా విలీన విద్య సమన్వయకర్త ఎన్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలోని భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు, ప్రోత్సాహకాలు, ఉపకరణాలు అందజేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈవో రచించిన కుమ్మరి మొల్లమాంబ పుస్తకాన్ని జడ్జి రాధిక ఆవిష్కరించారు. కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఆరాధన, స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు త్రివేణి, ప్రత్యేక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.