
హాజరు శాతం పెంచాలి
సారంగపూర్: విద్యార్థుల హాజరుశాతం పెంచి ఉత్తమ బోధన అందించేలా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా మాధ్యమిక విద్యాధికా రి జె.పరశురాం అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా తరగ తి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. సిలబస్ ఎంతవరకు వచ్చిందో స్వయంగా విద్యార్థులనే అడిగి తెలుసుకున్నారు. ఫేస్ రికగ్నిషన్ హాజరు నమోదు ప్రారంభమైందని విద్యార్థులు తప్పకుండా హాజరు కావాల ని సూచించారు. అనంతరం అధ్యాపకులతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు సూచనలు అందించారు. సిలబస్ త్వరగా పూర్తి చేసి రివిజన్ తరగతులను నిర్వహించడంతోపా టు సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయాల ని తెలిపారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు విద్యార్థులు ఉన్నారు.