భైంసా ఏరియాస్పత్రికి కార్పొరేట్ కళ
భైంసాటౌన్: భైంసా ప్రభుత్వ ఏరియాస్పత్రికి కా ర్పొరేట్ కళ సంతరించుకోనుంది. ఈ మేరకు తెలంగాణ వైద్యవిధాన పరిషత్ బ్రాండింగ్ పథకానికి ఈ ఆస్పత్రిని ఎంపిక చేసింది. తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కార్పొరేట్ స్థాయిలో ఆస్పత్రిలో మౌలిక వ సతులు, సుందరీకరణ, ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు బుధవారం డీసీహెచ్‌ఎస్ డాక్టర్ సురేశ్, టీఎస్‌ఎంఐడీసీ ఇంజినీరింగ్ విభా గం అధికారులు ఏరియాస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, ఆర్‌ఎంవో కై లాస్‌పతితో చర్చించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. భైంసా ఏరియాస్పత్రిలో అవసరమైన మౌలిక వసతులు, సుందరీకరణ, పార్కింగ్, ఓపీ, ఐపీ బ్యూటిఫికేషన్, ఫైర్‌సేఫ్టీ, గార్డెనింగ్ తదితర పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్ వి భాగం అధికారులు రూపొందించిన నివేదికను టీవీ వీపీ కమిషనర్‌కు అందిస్తామన్నారు. ఆపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు చేపడతామని చెప్పారు.


