ఆహా రామా.. అయోధ్య రామా..
ఐదు శతాబ్దాల స్వప్నం సాకారమవుతోంది. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరగబోతోంది. ఉమ్మడి జిల్లా నుంచి పలువురికి ఆహ్వానాలు అందాయి.
8లోu
శనివారం శ్రీ 20 శ్రీ జనవరి శ్రీ 2024
అధ్యాపకులకు శిక్షణ
భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అధ్యాపకులకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ట్రిపుల్‌ఐటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శశాంక్ గోయల్, రిటైర్డ్ ఐఏఎస్ ఎం.గోపాలకృష్ణ, ప్రొఫెసర్ మోనాఖారేతోపాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇన్‌చార్జి వీసీ మాట్లాడుతూ అధ్యాపకుల్లో నాయకత్వ లక్షణాలతోపాటు నైపుణ్యాన్ని, ప్రతిభను మెరుగుపరిచేందుకు శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. శనివారం కూడా శిక్షణ కొనసాగుతుందని తెలిపారు.
నిర్మల్: రామ మందిరం ప్రారంభత్సోవ శోభతో అయోధ్య విరాజిల్లుతోంది. ఆలయంలో జగదభి రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో యావత్ దేశమే కాదు.. ప్రపంచమంతా ఇప్పుడు అయోధ్యవైపే చూస్తోంది. ఇక జిల్లాలో పల్లె, పట్టణం, ఊరు, వాడ అని తేడా లేకుండా రామనమం మార్మోగుతోంది. ప్రతీ హిందువు ఇంట్లో శ్రీరాముడికి పూజలు నిర్వహిస్తున్నారు. జనవరి 22న ఆవిష్కృతమయ్యే అపురూప ఘట్టం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా జిల్లాతో శ్రీరాముడికి ఉన్న అనుబంధాన్ని ఇక్కడి ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.
జిల్లా అంతటా రామాలయాలు..
నిర్మల్: జగదభి రాముడు నడయాడిని జిల్లాలో పురాతన రామాలయాలు అనేకం ఉన్నా యి. ప్రస్తుతం ఉన్న దేవరకోట శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ముందుగా శ్రీరా ముడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది. అనంతర కాలంలో శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామిని కొలు వుదీర్చినట్లు చెబుతారు. జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురిలో పురాతన రామ మందిరం ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ సీతాసమేతుడిగా రాముడు పూజలు అందుకుంటున్నాడు. అలాగే బాగులవాడ వాల్మీకి నగర్‌లోనూ రామాలయం ఉంది. ఇక్కడా శ్రీరామచంద్రుడు నిత్య పూజలు అందుకుంటున్నాడు. శాంతినగర్‌లోనూ విశాల ప్రాంగణంలో రామాలయం ఉంది. అయోధ్య రా మాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఆలయాలను స్థానికులు ముస్తాబు చేస్తున్నారు.
● జిల్లా అంతటా రామనామస్మరణ
● కొత్త శోభ సంతరించుకుంటున్న రామాలయాలు
● జిల్లాలో శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం
● కామోల్ 306 ఏళ్లుగా పూజలందుకుంటున్న సీతారామలక్ష్మణులు
వనవాస సమయంలో..
శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో సీతామాతను అన్వేషిస్తూ జిల్లా కేంద్రం శివారులోని గండి(అటవీ ప్రాంతం)లోని గుహలో బస చేసినట్లు పెద్దలు చెబుతారు. అప్పుడే ఈ గుహలో రాముడు శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేశారని ప్రతీతి. అందుకే ఈ ఆలయానికి గండి రామలింగేశ్వర ఆలయంగా పేరొచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఈ ప్రాంతాన్ని కూడా గండి రామన్నగా, రామన్న గండిగా పిలుస్తారు. కాలక్రమంలో ఈ గుహ శివాలయం ఎదురుగా సాయిబాబా, దత్తాత్రేయ, గణపతి ఆలయాలను నిర్మించారు. ప్రస్తుతం గండి రామన్న దత్త సాయి ప్రాంగణంగా ఈ ఆలయం వాడుకలో ఉంది. రాముడు ప్రతిష్టించి శివలింగం మాత్రం ఇప్పటికీ భక్తుల పూజలందుకుంటోంది.
న్యూస్‌రీల్
నేడు నవోదయ ప్రవేశ పరీక్ష
నిర్మల్ రూరల్: సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని నవో దయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి జిల్లా వ్యాప్తంగా శనివారం ప్రవేశ పరీక్ష జ రగనుంది. జిల్లాలో మొత్తం ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,208 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 11:30 నుంచి 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తా రు.అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
పరీక్ష కేంద్రాలు ఇవే..
జిల్లా కేంద్రంలో సెయింట్ థామస్, విజయ హైస్కూల్, అల్‌ఫోర్స్ పాఠశాల, వాసవి హై స్కూల్, బైంసాలో వేదం పాఠశాల, వాసవి హై స్కూల్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
గుహలో శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం
పురాతన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు
కామోల్ గ్రామంలోని రామ మందిరం
బాగులవాడలోని రామాలయం


