అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు | Sakshi
Sakshi News home page

అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు

Published Fri, Nov 17 2023 1:00 AM

మాట్లాడుతున్న ఏఐసీసీ సెక్రెటరీ విష్ణునాథ్‌ - Sakshi

నిర్మల్‌చైన్‌గేట్‌: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని ఏఐసీసీ సెక్రెటరీ నిర్మల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి విష్ణునాథ్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని నిర్మల్‌ అభ్యర్థి శ్రీహరిరావు క్యాంపు కార్యాలయంలో గురువారం మాట్లాడారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన కాంగ్రెస్‌ ప్రచార సభ విజయవంతమైందన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం సౌమ్యుడు ప్రతిభావంతుడైన శ్రీహరిరావుని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిపిందని తెలిపారు.

భారీ మెజారిటీతో గెలిపించి నిర్మల్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగరవేయాలని కోరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మహిళలందరికీ రూ.500లకే సిలిండర్‌ అందిస్తామన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద భూమి ఉన్న రైతులతోపాటు కౌలు రైతులకు ఏడాదికి రూ 15 వేలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నిర్మల్‌ అభ్యర్థి కూచాడి శ్రీహరిరావు, ఏఐసీసీ అబ్జర్వర్‌ ప్రకాశ్‌రాథోడ్‌, ప్రకాశ్‌పాటిల్‌, పీసీసీ జనరల్‌ సెక్రెటరీ సత్తు మల్లేశ్‌, పీసీసీ కోఆర్డినేటర్‌ అనిల్‌కుమార్‌, సారంగాపూర్‌ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement