ఆన్‌లైన్‌లో ధ్యానం చేయండి
నిర్మల్‌టౌన్: ఈనెల 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకుని సామూహిక ధ్యాన కార్యక్రమం ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్నెస్ జోనల్ కోఆర్డినేటర్ మహమ్మద్ షరీఫ్ తెలిపారు. ఈమేరకు పోస్టర్లను నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. ఐక్యరాజ్యసమితి 2024లో డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించిందని తెలిపారు. లాభాపేక్షా లేకుండా కమలేష్ దేశ్‌భాయ్ పటేల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కన్హ శాంతివనం నుంచి ఆన్‌లైన్ ద్వారా పెద్ద ఎత్తున సామూహిక ధ్యానం నిర్వహిస్తున్నామన్నారు. రాత్రి 8 గంటల నుంచి 20 నిమిషాలపాటు ఉంటుందని తెలిపారు. పోస్టర్ల మీద ఉన్న క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి పేరు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.


