● తొలి సర్పంచ్‌గా చరిత్ర
ఆ నలుగురూ మహిళలే
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో కొత్తగా పంచాయతీలుగా ఏర్పడిన నాలుగు గ్రామాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నలుగురూ మహిళా సర్పంచులే గెలిచి చరిత్ర సృష్టించారు. రెండేళ్ల క్రితం న్యూధర్మాజీపేట, రంగపేట, కళ్యాణి, రంజనితండా గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఇంతకాలం ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగాయి. తాజాగా ఎన్నికల్లో తమ గ్రామంలోని వ్యక్తినే సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఖానాపూర్ మండలం రంగపేట తొలి సర్పంచ్‌గా పెట్టెం రాధ 109 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కడెం మండలం న్యూధర్మాజీపేట తొలి సర్పంచ్‌గా బాల సుమలత 12 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక తానూరు మండలం కళ్యాణి సర్పంచ్‌గా శంకాబాయిని గ్రామస్తులు 21 మెజారిటీతో గెలిపించారు. కుభీర్ మండలం రంజని తండా సర్పంచ్‌గా జాదవ్ కవిత 311 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
● తొలి సర్పంచ్‌గా చరిత్ర
● తొలి సర్పంచ్‌గా చరిత్ర
● తొలి సర్పంచ్‌గా చరిత్ర


