నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Dec 20 2025 9:20 AM | Updated on Dec 20 2025 9:20 AM

నిర్మ

నిర్మల్‌

● అవినీతికి అడ్డాగా ప్రభుత్వ కార్యాలయాలు ● కాసుల కోసం సొంత శాఖవారినీ వదలని వైనం ● ఏసీబీ దాడులు జరిపినా మారని వక్రబుద్ధి శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 ● భైంసా డివిజన్‌లో ఇటీవల ఏసీబీ దాడులు పెరిగాయి. గతేడాది మే 22న భైంసా మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు, బిల్‌ కలెక్టర్‌ విద్యాసాగర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పట్టణంలో ఓ భవన నిర్మాణ విషయమై రూ.30 వేలు లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో వారు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ● ఈ ఏడాది ఫిబ్రవరి 25న భైంసా ఎకై ్సజ్‌ ఎస్సై నిర్మలతోపాటు కానిస్టేబుల్‌ సుజాత ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గ్రామంలో తోటి కల్లు వ్యాపారితో సమస్య పరిష్కారం కోసం ఎస్సైని సంప్రదించగా, ఆమె రూ.10 వేల లంచం డిమాండ్‌ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, వారు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ● ఇదే ఏడాది అక్టోబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలు, చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తానూర్‌ మండలం బెల్‌తరోడ చెక్‌పోస్ట్‌లో తనిఖీలు జరిపారు. అక్కడ డబ్బాలో వాహనాల డ్రైవర్లు వేసిన డబ్బులు రూ.3 వేల వరకు స్వాధీనం చేసుకున్నారు. ● తాజాగా బాసర పీహెచ్‌సీ సీనియర్‌ అసిస్టెంట్‌ భీమన్న తన తోటి ఉద్యోగికి జీపీఎఫ్‌, సరెండర్‌ లీవ్‌, ఫిక్స్‌డ్‌ ట్రావెలింగ్‌ అలవెన్స్‌ బిల్లులు ముందుగా తయారు చేసినందుకు రూ.9 వేలు లంచంగా తీసుకుని పట్టుబడ్డాడు.

10లోu

న్యూస్‌రీల్‌

వరల్డ్‌ విజన్‌ సేవలు

అభినందనీయం

లక్ష్మణచాంద: వరల్డ్‌ విజన్‌ సేవలు అభినందనీయం అని డీఈవో భోజన్న అన్నారు. మండ ల కేంద్రంలోని కేజీబీవీలో వరల్డ్‌ విజన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వరల్డ్‌ విజన్‌ ఆధ్వర్యంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 385 మందికి ఒక్కొక్కరికి రూ.480 విలువ చేసే మెటీరియల్‌ అందించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని వరల్డ్‌ సభ్యులను కోరారు. ఇందులో ఎంఈవో అశోక్‌వర్మ, హెచ్‌ఎం రాజునాయక్‌, ఎస్‌వో నవిత, వరల్డ్‌ విజన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ బ్రహ్మన్న, ఉపాధ్యాయులు హరిప్రసాద్‌, అశోక్‌ పాల్గొన్నారు.

భైంసాటౌన్‌: ‘ఇందు కలదందు లేదన్న సందేహం వలదు..’ అన్నచందంగా దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచావతారులు ఉన్నారు. ఇటీవలి కాలంలో జిల్లాలో పలువురు ఏసీబీకి పట్టుబడుతుండడమే ఇందుకు నిదర్శనం. అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఉద్యోగులు, లంచావతారులు ఉ న్నా.. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడే ఇలాంటి ఏసీబీ దాడులు చేస్తోంది. వెలుగులోకి రాని వారెందరో ఇంకా ఆయా శాఖల్లో దర్జాగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయా కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే సామాన్యులు మొదలు.. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు వరకు చేయి తడపనిదే ఏ పని జరగదన్నది బహిరంగ రహస్యం. ఇక, సొంత శాఖలోని ఉద్యోగులను సైతం వదలడం లేదు కొందరు లంచావతారులు. బాసర పీహెచ్‌సీ సీనియర్‌ అసిస్టెంట్‌ భీమన్న తన తోటి ఉద్యోగి వద్ద రూ.9 వేలు ఫోన్‌పే ద్వారా పొందినందుకు ఏసీబీకి పట్టుబడడమే ఇందుకు నిదర్శనం.

పెరిగిన చైతన్యం..

అధికారుల్లో పెరిగిన అవినీతితో లేక ప్రజల్లో పెరిగిన చైతన్యమో కానీ.. ఇటీవలి కాలంలో అవినీతి నిరోధక శాఖకు పట్టుబడుతున్న వారి సంఖ్య పెరిగింది. విస్తృత ప్రచారం కూడా కారణంగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా వేతనం అందుతున్నా.. కొందరు ఉద్యోగులు తమ వక్రబుద్ధి చూపిస్తూనే ఉన్నారు. సామాన్యులు పనికోసం ప్రభుత్వ కార్యాలయానికి వస్తే పైసల కోసం వేధిస్తున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటును ఫిక్స్‌ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రజలకు ఉచితంగా అందాల్సిన సేవలు డబ్బులిచ్చి పొందాల్సిన దుస్థితి ఏర్పడింది. మున్సిపల్‌, ఎకై ్సజ్‌, విద్యుత్‌, ఇంజినీర్‌, రెవెన్యూ, ఆర్టీఏ, మైనింగ్‌, అటవీ, విద్య, వైద్యం ఇలా.. దాదాపు అన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది.

ఇటీవల జరిగిన ఏసీబీ రైడ్స్‌ వివరాలు..

పట్టుబట్టి కొలువు కొట్టారు

గ్రూప్‌–3 ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన పలువురు సత్తా చాటారు. మెరుగైన ర్యాంక్‌ సాధించి ప్రభుత్వ కొలువులు కొట్టారు.

లంచం అడిగితే

ఫిర్యాదు చేయాలి..

ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064ను సంప్రదించాలి. లేదా వాట్సాప్‌ నంబర్‌ 94404 46106 నంబర్‌ లేదా, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతాం. – జి.మధు, డీఎస్పీ, ఏసీబీ

నిర్మల్‌1
1/1

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement