మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై మాట్లాడుతుండగా మైక్‌ కట్‌ | Ysrcp Mp Gumma Thanuja Rani Speech On Women Reservation Bill | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై మాట్లాడుతుండగా మైక్‌ కట్‌

Apr 17 2026 3:24 PM | Updated on Apr 17 2026 3:34 PM

Ysrcp Mp Gumma Thanuja Rani Speech On Women Reservation Bill

సాక్షి, ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతున్న మహిళా ఎంపీ మై‍క్‌ కట్ చేయడంపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు తనూజ రాణి, గురుమూర్తి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మైక్ కట్ చేసిన సభాస్థానంలో టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఉన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగింది. వైఎస్సార్‌సీపీ తరఫున చర్చలో ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజారాణి పాల్గొన్నారు. టీడీపీ హయాంలో మహిళలపై కొనసాగుతున్న హింసను ఆమె ప్రస్తావించారు. 

ఏపీలో మహిళను తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిని చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. నామినేటెడ్ పోస్టుల్లో, కాంట్రాక్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌ది. అమ్మ ఒడి, మహిళల పేరుపైనే ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 2019-24 వైఎస్‌ జగన్ పరిపాలనా కాలం మహిళలకు స్వర్ణయుగం లాంటిది. ఏపీలో మహిళలపై హింస జరుగుతుంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన ఘటన తీవ్ర ఆందోళనకరం. అధికార పార్టీలోని ప్రజాప్రతినిధులు మహిళలను వేధిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు’’ అని తనూజరాణి మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement