Woman Stands On the Ledge of Window, Heart Stopping Clip Viral - Sakshi
Sakshi News home page

నాలుగో అంతస్తులో నిలబడి కిటికీ అద్దాలు శుభ్రం చేస్తూ... షాకింగ్‌ వీడియో వైరల్‌

Oct 22 2022 4:20 PM | Updated on Oct 22 2022 5:44 PM

Woman Stands On the Ledge of Window, Heart Stopping Clip Viral - Sakshi

ఏ పండుగ, శుభకార్యం అయినా షాపింగ్‌, ఇంట్లో పనులు, అందంగా రెడీ అవ్వడం ఇవన్నీ ముఖ్యంగా ఉండే విధులు. వీటన్నింటిలో  ఇళ్లు శుభ్రం చేసుకోవడం మెయిన్‌ టాస్క్‌. ఇంటిని శుభ్రం చేయడంలో ఆడవారిదే అందెవేసిన చేయి. ఇళ్లు తళతళా మెరిసిపోవాలన్న ఉద్ధేశంతో ఓపిక ఉన్నా లేకున్నా వారం రోజుల ముందు నుంచే క్లీన్‌ చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొంతమంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు, సహసాలు చేస్తుంటారు. అచ్చం ఇలాగే ఓ మహిళ ప్రాణాలను లెక్కచేయకుండా ఇళ్లు శుభ్రం చేస్తూ అందరిని ఉలక్కిపడేలా చేసింది.

సాధారణంగా అపార్టుమెంట్లలో పై అంతస్తులో ఉండే వాళ్లు  ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు కిటికీ అద్దాలు తుడవాలంటే లోపలి నుంచే తుడవాలి. బయటకు వెళ్లి శుభ్రం చేయడం సాధ్యం కాదు. కానీ ఓ అపార్ట్‌మెంట్‌లో నాలుగో అంతస్తులో నివసిస్తున్న మహిళ గోడ బయటవైపు నిలబడి కిటికీ అద్దాలు తుడిచింది. కిటికీ గోడ అంచులపై నిర్లక్ష్యంగా ఉండి ఎలాంటి భయం లేకుండా ఆమె పని ఆమె చకచకా చేసుకుపోయింది. కిటికీ ఊచల్ని మాత్రమే పట్టుకుని అద్దాలు తుడుస్తున్న ఈ వీడియోను చూస్తే గుండె ఆగిపోవడం  ఖాయం. ఎందుకంటే ఏమాత్రం పట్టుజారినా ప్రమాదమే.

ఎదురింట్లో ఉన్న వ్యక్తి ఎవరో ఈ దృశ్యాన్ని వీడియో తీసి ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘ఈ దీపావళికి గనుక మహాలక్ష్మి ఆమె ఇంటికి రాకపోతే ఇంక ఎవరి ఇంటికి రాదు’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ‘వామ్మో నాకు గుండె ఆగినంత పనైంది. ఇంత రిస్క్‌ అవసరమా. ఇలాంటి సహసాలు చేయవద్దు) అని రకరకాలుగా కామెంట్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement