ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌: ‘ఇలాంటి కేసులు మాకు మామూలే’

Win Some, Lose Some: Mukul Rohatgi on Bombay HC Bail to Aryan Khan - Sakshi

ముంబై: ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసులో ఇరుక్కున్న తన కుమారుడు ఆర్యన్‌ను జైలు నుంచి విడిపించేందుకు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మాజీ అటార్నీ జనరల్, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సాయంతో ఆర్యన్‌ ఖాన్‌ జైలు నుంచి విడుదల కాబోతున్నాడు. బాంబే హైకోర్టు గురువారం అతడికి బెయిల్‌ మంజూరు చేసింది. ఆర్యన్‌ ఖాన్‌ తరపున ముకుల్ రోహత్గీ కోర్టులో వాదనలు వినిపించారు. కోర్టు తీర్పుపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఇలాంటి కేసులు తమకు సర్వసాధారణమని వ్యాఖ్యానించారు.  

‘కోర్టు నుంచి ఆర్డర్‌ కాపీ వచ్చిన తర్వాత ఆర్యన్‌ఖాన్, అర్బాజ్‌ మర్చంట్, మున్‌మున్‌ ధమేచాలు జైలు నుండి విడుదలవుతారు. ఇలాంటి కేసులు నాకు సర్వసాధారణం.  కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం. అతనికి (ఆర్యన్‌ ఖాన్) బెయిల్ లభించినందుకు నేను సంతోషిస్తున్నాను’ అని ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. 

కోర్టు తీర్పుకు సంబంధించిన ఆర్డర్‌ కాపీ శుక్రవారం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆర్యన్‌ఖాన్‌తో పాటు మిగతా ఇద్దరు రేపు విడుదల అవుతారని.. ఒకవేళ ఆలస్యం జరిగితే శనివారం జైలు నుంచి బయటకు వస్తారని తెలిపారు. కాగా, ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ రావడంతో అతడి కుటుంబం ఊపిరి పీల్చుకుంది. (చదవండి: ముంబై మాదక ద్రవ్యాల కేసులో రోజుకో కొత్త మలుపు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top