లగ్జరీ బైక్‌పై బెంగాల్‌ బీజేపీ మంత్రి రైడ్, వీడియో వైరల్‌ | West Bengal Minister Dilip Ghosh Seen Riding A Bike In Kolkata This Morning, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

లగ్జరీ బైక్‌పై బెంగాల్‌ బీజేపీ మంత్రి రైడ్, వీడియో వైరల్‌

May 29 2026 5:31 PM | Updated on May 29 2026 6:07 PM

WB Minister Dilip Ghosh seen riding a bike in Kolkata this morning

సాక్షి, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ మంత్రి దిలీప్‌ ఘోష్‌ బైక్‌ రైడ్‌ చేసి ఆకట్టుకున్నారు. కోల్‌కత్తా వీధుల్లో  ఖరీదైన హోండా గోల్డ్‌ వింగ్‌ను రాయల్‌గా చక్కర్లు కొట్టారు.   ఈ రైడ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

దీనిపై నెటిజన్లు విభిన్నంగా కామెంట్‌ చేశారు. మరికొంతమంది మంత్రి బైక్‌ నడపడం చూసి ఆశ్చర్య పోయారు. హెల్మెట్ లేకుండా బైక్ ఎలా నడుపుతున్నారని కొంతమంది విమర్శిస్తే.. ఇంత ఆదాయం ఎక్కడిది అంటూ @IncomeTaxIndia  ట్యాగ్‌ చేయడం విశేషం ఈ బైక్‌ ధర మార్కెట్‌లో దాదాపు రూ.53 లక్షల వరకు ఉంటుందని అంచనా.

దీనికి సంబంధించిన వివరాలను కూడా  మంత్రి దిలీప్‌   ఎక్స్‌లో షేర్‌ చేశారు,  Honda BigWing సూపర్ బైక్‌ అత్యంత వేగవంతమైన, 1800cc సామర్థ్యం గల 6-సిలిండర్ల మోటార్‌సైకిల్. ఈ బైక్ ఎంతో సౌకర్యవంతంగా ఉండటమే కాదు, అద్భుతమైన వేగాన్ని అందిస్తుంది. దీని వెనుక భాగంలో విశాలమైన స్థలం ఉంది; అక్కడ సోఫాలాంటి ప్రయాణీకుల సీటు ఉండటం వల్ల, వెనుక కూర్చునే వ్యక్తి కూడా అత్యంత సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు అంటూదీని ఫీచర్స్‌ గురించి రాసుకొచ్చారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement