తండ్రితో పెళ్లికూతురు హుషారైన స్టెప్పులు.. ఫిదా అవ్వాల్సిందే | Viral Video: Bride Amazing Dance With Her Father | Sakshi
Sakshi News home page

Bride Dance With Father: తండ్రితో పెళ్లికూతురు హుషారైన స్టెప్పులు, వైరల్‌

Aug 20 2021 6:15 PM | Updated on Aug 20 2021 6:44 PM

Viral Video: Bride Amazing Dance With Her Father - Sakshi

అదేంటోగానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా.. పెళ్లిళ్ల వార్తలే కనిపిస్తున్నాయి.ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ఈ సందడి ఇంకా ఎక్కువైంది. ఈ క్రమంలో తాజాగా పెళ్లి వేడుకలో వధువు చేసిన డ్యాన్స్‌ వైరల్‌గా మారింది. అయితే వధువు డ్యాన్స్‌ చేసింది వరుడితో కాదు. ఆమె తండ్రితో. వధువు తన తండ్రితో కలిసి సంగీత్‌లో చాలా ఎనర్జిటిక్‌గా డ్యాన్స్‌ చేసింది.

ముద్దుల కూతురు ఏకంగా తండ్రితో కలిసి సంతోషంగా, హుషారుగా స్టెప్పులేయడం అందరిని ఆకట్టుకుంటోంది. ఇక తండ్రీకూతుళ్ల డ్యాన్స్‌ నెటిజన్ల హృదయాలను దోచుకుంటుంది.ప్రపంచంలోని ఆనందమంతా ఈ తండ్రీకూతుళ్ల కళ్లల్లోనే కనిపిస్తుందని కామెంట్‌ చేస్తున్నారు. కాగా ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియరాలేదు. వెడ్‌గోఈజీ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ దీనికి చెందిన వీడియోను షేర్ చేసింది.
చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్‌ డ్యాన్స్‌.. భర్త ఫిదా

Advertisement
 
Advertisement
Advertisement