
లక్నో: ఈ ఏడాది మద్యం అమ్మకాల్లో ఉత్తరప్రదేశ్ కొత్త రికార్డు సృష్టించింది. 2025 జనవరి నుంచి ఆగస్టు వరకు రూ.22,337 కోట్లు ఆదాయాన్ని సంపాదించింది. గతేడాది ఇదే సమయానికి వచ్చిన ఆదాయం కంటే.. రూ.3,021.41 కోట్లు అధిక ఆదాయం వచ్చింది. మద్యం వినియోగం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఒక్క ఆగస్టు నెలలోనే ఆగస్టు నెలలోనే ఆ శాఖ రూ.3,754.43 కోట్లు ఆదాయం ఆర్జించింది. గతేడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయం కంటే రూ.174.24 కోట్లు ఎక్కువ సాధించి.. తన ఆదాయ రికార్డును తానే బద్దలు కొట్టిందని ఎక్సైజ్ శాఖ సహాయ మంత్రి నితిన్ అగర్వాల్ చెప్పారు.