అందుబాటులో అమెరికా విద్యార్థి వీసా అపాయింట్‌మెంట్లు | US Student Visa appointments available in India | Sakshi
Sakshi News home page

అమెరికా విద్యార్థి వీసా అపాయింట్‌మెంట్లు రెడీ

May 6 2025 2:56 PM | Updated on May 6 2025 3:44 PM

US Student Visa appointments available in India

న్యూఢిల్లీ: అమెరికా విద్యార్థి వీసా పొందాలనుకునే వారికి భారతదేశవ్యాప్తంగా వేల సంఖ్యలో వీసా అపాయింట్‌మెంట్లు (Visa appointments) అందుబాటులో ఉన్నాయని భారత్‌లోని అమెరికా ఎంబసీ సోమవారం తెలిపింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా దౌత్యకార్యాలయం తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లోని ఖాతాలో ఒక పోస్ట్‌చేసింది. ప్రతి ఏడాది అత్యధిక మంది భారతీయులకు విద్యార్థి వీసాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని గత ఏడాది ఏప్రిల్‌లో నాటి భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ వ్యాఖ్యానించడం తెల్సిందే. యూఎస్ స్టూడెంట్ వీసా ఇంట‌ర్వ్యూ స్లాట్లు మాయ‌మ‌యిన‌ట్టు మీడియాలో వార్త‌లు రావ‌డంతో అమెరికా ఎంబసీ ఈ మేర‌కు స్పందించింది.

గ‌త కొద్ది రోజులుగా వీసా అపాయింట్‌మెంట్ల కోసం విద్యార్థులు క‌ష్టాలు ప‌డుతున్నారు. జ‌న‌వరి వ‌ర‌కు స‌వ్యంగానే సాగిన వ్య‌వ‌స్థ త‌ర్వాత ఆగ‌మాగమ‌యింది. ఇంట‌ర్వ్యూ స్లాట్ల కోసం విద్యార్థులు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే అమెరికా రాయబార కార్యాలయాల్లో ఇటీవల అమలు చేసిన సిస్టమ్ అప్‌గ్రేడ్ల కార‌ణంగానే స్లాట్ల బుకింగ్‌కు అంత‌రాయం ఏర్ప‌డి ఉండొచ్చ‌ని నిపుణులు అంటున్నారు. వీసా అపాయింట్‌మెంట్లలో దుర్వినియోగాన్ని నివారించేందుకు ఈ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. కాగా, ఈ విష‌యంపై యూఎస్ ఎంబ‌సీ ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

 

 

చ‌ద‌వండి: అతిథుల్లా వ్య‌వ‌హ‌రించ‌లేదో.. గ్రీన్‌కార్డ్ కోల్పోతారు

ఎయిమ్స్‌లలో ప్రత్యేక ఆయుష్‌ విభాగాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లలో ప్రత్యేక ఆయుష్‌ విభాగాలను ఏర్పాటు చేయాలన్న నీతి ఆయోగ్‌ ప్రతిపాదనపై కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఆయుర్వేదం, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి విధానాలను అలోపతితో సమన్వయం చేసి సమగ్ర ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడమే లక్ష్యంగా కొత్తగా ఏర్పాటయ్యే ఈ విభాగాల ద్వారా ఎయిమ్స్‌లలో సంప్రదాయ వైద్య విధానాలు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement