ఒకే వేదికపై రెండు పెళ్లిళ్లు.. సంబరపడిన బంధువులకు సడెన్‌ షాక్‌!

Two Wedding Procession One Refused to Marry - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఒక ఇంటిలోని ఇద్దరు అమ్మాయిలకు ఒకే మూహూర్తానికి పెళ్లి నిశ్చయమయ్యింది. వివాహ వేడుకలో భాగంగా ఇద్దరు వరుల తరపు వారు ఊరేగింపుగా వధువుల ఇంటికి వచ్చారు. ఆ ఇద్దరు వరులను ఆహ్వానిస్తూ వధువులు వారికి పూల దండలు వేశారు. అయితే ఒక వరుని తరపువారితో వధువు తరపు వారికి ఏదో విషయమై వివాదం తెలెత్తింది. దీంతో చివరకు రెండు వివాహాలు జరగాల్సిన చోట ఒక వివాహమే జరిగింది. 

ఈ ఘటన ఫిరోజాబాద్‌లోని బైపాస్‌ రోడ్డులో చోటుచేసుకుంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం జస్రానా గ్రామానికి చెందిన రాధేశ్యామ్‌ రాజ్‌పూత్‌ ఒకే ముహూర్తానికి తన ఇద్దరు కుమార్తెలకు వివాహం తలపెట్టారు. వివాహ వేడుకలో భాగంగా ఇద్దరు వరుల తరపువారు సోమవారం రాత్రి కల్యాణ మండపానికి చేరుకున్నారు. 

డాన్స్‌ చేయడంపై వివాదం
వధువులిద్దరూ తమతమ వరులకు పూల దండలు వేసి ఆహ్వానించారు. తరువాత రాయపూర్‌ నుంచి వచ్చిన మగపెళ్లివారికి, వధువు తరపు వారికి డాన్స్‌ చేయడం విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఇది ఇరు పక్షాల వారు పరస్పరం కొట్టుకునేంతవరకూ దారితీసింది. దీంతో ఒక వధువు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెగేసి చెప్పింది. వరుని తరపు వారు తమవారిపై చేయిచేసుకోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయని.. అందుకే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. 

పోలీసుల జోక్యంతో..
ఈ వివాదం పోలీసుల వరకూ చేరింది. జస్రానా పోలీసులు కల్యాణ మండపానికి చేరుకుని, ఇరుపక్షాల వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కూడా పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. వధువు తరపువారికి ఎంతనచ్చజెప్పినా వారు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో రాయ్‌పూర్‌ నుంచి వచ్చిన వరుడు పెళ్లి కాకుండానే తన కుటుంబ సభ్యులు, బంధువులతో తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఈ వివాదం ముగిసిన తరువాత రాధేశ్యామ్‌ రాజ్‌పూత్‌ తన మరో కుమార్తెకు వివాహం జరిపించాడు.
ఇది కూడా చదవండి: ఆ వెబ్‌ సిరీస్‌ చూసి.. ₹2000 దొంగనోట్లు ముద్రించి..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top