ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి | Two Maoists were killed in the encounter | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Apr 23 2023 5:41 AM | Updated on Apr 23 2023 5:41 AM

Two Maoists were killed in the encounter - Sakshi

బాలాఘాట్‌: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో కడ్లా అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు.

వీరిని ఏరియా కమిటీ సభ్యురాలు(ఏసీఎం), భోరందేవ్‌ కమిటీ కమాండర్‌ సునీత, విస్తార్‌ దళానికి చెందిన ఏసీఎం సరితా ఖటియా మోచాగా గుర్తించారు. వీరిద్దరి తలలపై రూ.14 లక్షల చొప్పున రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. వీరి వద్ద తుపాకులు, మందుగుండు సామగ్రి, విప్లవ సాహిత్యం దొరికిందన్నారు. వీరిద్దరూ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన వారిగా భావిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement