Trending News Today: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Top10 Telugu Latest News Evening Headlines 30th May 2022 - Sakshi

1. నా దుస్తులు అమ్మి అయినా ప్రజలకు చౌకగా గోధుమపిండి అందిస్తా!
వచ్చే 24 గంటల్లో 10 కిలోల గోధుమ పిండి బస్తా ధరను తగ్గించకుంటే తన బట్టలను అమ్మేస్తానని పాక్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. రైతు సంఘాల నేత రాకేష్‌ టికాయత్‌పై ఇంక్‌ దాడి.. వాళ్లే పనే అని అనుమానం!
రైతు సంఘాల నేత రాకేష్‌ టికాయత్‌పై కర్ణాటకలో దాడి జరిగింది. బెంగళూరులో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. రసాభాసా నెలకొంది. ఆయన ముఖంపై కొందరు సిరా చల్లి దాడి చేశారు. 
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. 3 Years Of YS Jagan Government: మూడేళ్లు.. ఎన్నో మేళ్లు
 అన్ని స్థాయిల్లో ప్రక్షాళన, విప్లవాత్మక మార్పులతో పాలన ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి  గడిచిన మూడేళ్లలో సరికొత్త సంక్షేమ, అభివృద్ధి పాలనను అందించి ప్రజల మన్ననలు అందుకున్నారు. 
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. Minister Mallareddy: నన్ను చంపేందుకు రేవంత్‌ రెడ్డి కుట్ర చేస్తున్నాడు
‘రెడ్ల సింహ గర్జన’ సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డిపై ఆదివారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడిపై మంత్రి మాల్లారెడ్డి సోమవారం స్పందించారు. మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాపై జరిగిన దాడి వెనుక తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి హస్తం ఉంది.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి


5. లోకేష్‌ను చంద్రబాబు నమ్మడం లేదు: విజయసాయిరెడ్డి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాట తప్పనిది. 
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. Krithi Shetty Crying: లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్న కృతి శెట్టి..
 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి
 


7IPL 2022 Winner: క్రెడిట్‌ మొత్తం ఆయనకేనన్న హార్దిక్‌.. అంతా అబద్ధం! కాదు నిజమే!
‘‘మొదటి సీజన్‌లోనే మనం సిక్సర్‌ కొట్టాము. చాంపియన్లుగా నిలిచాం. ఇది మనకు గర్వకారణం. మన బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగం మరీ అంత గొప్పగా ఏమీ లేదని చాలా మంది అన్నారు. అయినా మనం ట్రోఫీ గెలిచాం.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి
 

8. మాయదారి ట్విటర్‌..కరిగిపోతున్న మస్క్‌ సంపద!
బిలయనీర్లు ఈలాన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, బిల్‌ గేట్స్‌' సంపద కరిగి పోతున్నట్లు తెలుస్తోంది. గడిచిన 5 నెలల కాలంలో ఆ ముగ్గురు ధనవంతులు 115బిలియన్‌ డాలర్లను నష్టపోయారు. వీరితో పాటు వరల్డ్‌ రిచెస్ట్‌ పర్సన్‌ల జాబితాలో 3వ స్థానంలో ఉన్న జపాన్‌ లగ్జరీ గూడ్స్‌ కంపెనీ ఎల్‌వీఎంహెచ్‌ బెర్నార్డ్ ఆర్నాల్ట్ సైతం 44.7 బిలియన్‌ డాలర్లను కోల్పోయారు. 
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. Riyan Parag: 'ఆ ఆటగాడు దండగ.. ఏ లెక్కన ఆడించారో కాస్త చెప్పండి'
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ ఆటతీరుపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సీజన్‌లో రాజస్తాన్‌ తరపున వ్యర్థమైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది రియాన్‌ పరాగేనని క్రికెట్‌ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేశారు.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. Hyderabad: బోర్డ్ తిప్పేసిన ఐటీ సంస్థ.. రోడ్డున పడ్డ 800 మంది ఉద్యోగులు
నిరుద్యోగుల ఆశలను అవకాశంగా మార్చుకుని వారి వద్ద అందినంత దోచుకుని బోర్డు తిప్పేసింది ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ. ఈ దెబ్బతో 800 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగింది.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top