డీఎంకే ఫైల్స్‌పై పరువు నష్టం దావా.. అయినా తగ్గేదేలే అంటూ అన్నామలై సవాల్‌

TN Government Files Defamation Case Against BJP Chief Annamalai - Sakshi

చెన్నై: బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనున్నాడు. డీఎంకే ఫైల్స్‌తో రాజకీయ కాక రేపుతున్న ఆయన్ని కోర్టుకు లాగబోతోంది తమిళనాడు సర్కార్‌. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పరువుకు భంగం కలిగించే విధంగా అన్నామలై యత్నిస్తున్నారంటూ ఆరోపణలకు దిగిన ప్రభుత్వం.. ఈ మేరకు ఇవాళ అన్నామలై మీద పరువు నష్టం దావా కూడా వేసింది. 

చెన్నై మెట్రో కాంట్రాక్ట్‌ కోసం 2011లో 200 కోట్ల ముడుపులను ఎంకే స్టాలిన్‌ అందుకున్నారంటూ.. అన్నామలై సంచలన ఆరోపణలకు దిగాడు. అంతేకాదు.. డీఎంకే నేతల ఆస్తుల విలువ 1.34 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని, అదంతా అవినీతి సొమ్మని, పైగా దుబాయ్‌కు చెందిన ఓ కంపెనీలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగా.. ఆ కంపెనీలో స్టాలిన్‌ కుటుంబ సభ్యులు రహస్య డైరెక్టర్లుగా ఉన్నారంటూ వరుసగా ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో డీఎంకే లీగల్‌ నోటీసులు కూడా పంపింది. అయినా ఆయన తగ్గట్లేదు.

తమిళనాడు రాజకీయాలను డీఎంకే ఫైల్స్‌ పేరుతో అన్నామలై చేస్తున్న సోషల్‌ మీడియాలో పోస్టులు వేడెక్కిస్తున్నాయి. అందులోభాగంగా.. ఆర్థిక మంత్రి పళనివేళ్‌ థైగరాజన్‌ పేరిట విడుదల చేసిన ఓ ఆడియో క్లిప్‌ తమిళనాట పెను సంచలనంగా మారింది. స్వయానా సీఎం స్టాలిన్‌ తనయుడు, ఆయన అల్లుడు సబరీసన్‌లు ఏడాదికి 30 వేల కోట్లను అవినీతి మార్గంలో సంపాదించారంటూ అందులో పళనివేళ్‌.. వేరేవరికో చెబుతున్నట్లు ఉంది. అంతేకాదు ఐదు రోజులు గ్యాప్‌తో పళనివేళ్‌కు సంబంధించిన మరో ట్విటర్ ఆడియో క్లిప్‌ను సైతం విడుదల చేశాడు అన్నామలై. అయితే పళనివేళ్‌ సహా డీఎంకే నేతలంతా ఆ క్లిప్‌ ఎడిట్‌ చేసిందంటూ ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ క్రమంలో విమర్శలతో పేట్రేగిపోతున్న  అన్నామలై నోటికి తాళం వేయాలని డీఎంకే సర్కార్‌ భావించింది. అందుకే పరువు నష్టం దావా వేసింది. 

డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్‌ ఎళన్‌గోవన్‌ తాజా పరిణామాలపై మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఏ తప్పు చేయకున్నా అనర్హత వేటు ఎదుర్కొంటున్నారు. అలాంటిది అన్నామలై లాంటి వాళ్లు అంతలా చేస్తున్నప్పుడు.. వాళ్ల  మీద దావా వేయడానికి కారణం సరిపోతుంది కదా.  అన్నామలైను శిక్షించేందుకు ఇదే మంచి సమయం అంటూ పేర్కొన్నారాయన. 

ఇదిలా ఉంటే.. డీఎంకే లీగల్‌ నోటీసులు పంపినా కూడా క్షమాణలు చెప్పడానికి అన్నామలై నిరాకరిస్తున్నారు. అంతేకాదు ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని చెప్తున్నాడు. ఏప్రిల్‌ 14వ లేతఅన డీఎంకే నేతల ఆస్తులని పేర్కొంటూ ఓ పెద్ద లిస్ట్‌ను విడుదల చేశౠరాయన. అందులో స్టాలిన్‌ తనయుడు.. క్రీడా శాఖ మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్‌తో పాటు మరికొందరు మంత్రుల పేర్లు సైతం ఉన్నాయి. అయితే డీఎంకే ఇదంతా జోక్‌గా కొట్టిపారేసింది. 

ఇదీ చదవండి: త్వరలో చిన్నమ్మతో భేటీ
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top