
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసుల(Defamation Cases)ను నేరరహి తంగా చూడాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు ‘ది వైర్’అనే ఆన్‌లైన్ పబ్లికేషన్ సంస్థపై పరువు నష్టం కేసు వేశారు(The Wire Defamation Case). ఈ మేరకు మేజిస్ట్రేట్ కోర్టు ది వైర్‌కు సమన్లు జారీ చేయగా, ఢిల్లీ హైకోర్టు దానిని సమర్థించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ‘ది వైర్’వేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా జస్టిస్ ఎంఎం సుందరేశ్(Justice MM Sundaresh).. ‘ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం నేరం కాదని నిర్థారించాల్సిన సమయం వచ్చింది’ అంటూ వ్యాఖ్యానించారు. ది వైర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ దీనిని సమర్థిస్తూ సంబంధిత చట్టంలో సంస్కరణలను చేపట్టాల్సిన అవసర ముందన్నారు. భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ) లోని సెక్షన్ 499 ప్రకారం పరువునష్టం కలిగించడం నేరం కాగా, దీనినే భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్) కూడా సెక్షన్ 356గా కొనసాగించింది.
అయితే, న్యాయ మూర్తి సుందరేశ్ వ్యాఖ్యలు 2016లో సుబ్రమణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. పరువు నష్టం చట్టంలోని నిబంధనలకు రాజ్యాంగబద్థత ఉందని అప్పటి తీర్పులో సుప్రీంకోర్టు సమర్థించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే, గౌరవం పొందే ప్రాథమిక హక్కు కిందకు ఇది వస్తుందని తెలిపింది.
ఇదీ చదవండి: కొందరు జడ్జిలు సరిగా పని చేయట్లేదు!