
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. జ్వరం కారణంగా నేటి అధికారిక కార్యక్రమాలు రద్దు అయ్యాయి. శనివారం రాత్రి నుంచి ఆయనకు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారు. ముందుగా ప్రకటించిన మేరకు స్టాలిన్.. వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో సోమవారం పర్యటించాల్సి ఉంది. ఆయన పర్యటించే తేదీలను త్వరలో ప్రకటిస్తారని అధికారులు తెలిపారు.
చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: వందల సంఖ్యలో రైళ్లు రద్దు
Comments
Please login to add a commentAdd a comment