సైకిల్‌ తొక్కిన సోనియా గాంధీ | Sonia Gandhi Cycling In Goa | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ అధినేత్రి సైకిల్‌ షికారు

Nov 25 2020 6:03 PM | Updated on Nov 25 2020 6:15 PM

Sonia Gandhi Cycling In Goa - Sakshi

సోనియా గాంధీ తాత్కాలికంగా తన నివాసాన్ని దేశ రాజధాని ఢిల్లీ నుంచి గోవాకి మార్చిన విషయం తెలిసిందే.

పణజి: వాయు కాలుష్యం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో పాటు, కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభన సైతం మొదలవడంతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తాత్కాలికంగా తన నివాసాన్ని దేశ రాజధాని ఢిల్లీ నుంచి గోవాకి మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆవిడ తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా సోనియా గోవా వీధుల్లో, బాడీగార్డుల నడుమ సైకిల్‌ తొక్కుతూ, జాగింగ్‌ చేస్తూ శారీరక కసరత్తులు మొదలుపెట్టారు. ఆవిడను గు​ర్తుపట్టిన పర్యాటకులు, అభిమానులు సెల్ఫీల కోసం పోటీపడ్డారు. కొందరు స్థానికులు సోనియా సైకిల్‌ తొక్కుతున్న ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో ప్రస్తుతం అవి దేశవ్యాప్తంగా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. (అహ్మద్‌ పటేల్‌ మృతి.. సోనియా భావోద్వేగం)

Advertisement
 
Advertisement
Advertisement