
లక్నో: పబ్జీ గేమ్‌ను భారత్‌తో బ్యాన్ చేసిన దాని వల్ల జరుగుతున్న దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా గంటలు గంటలు పబ్జీ అడొద్దు అని చెప్పినందకు ఒక కొడుకు తన తండ్రిని కత్తితో గాయపరిచాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటు చేసుకుంది. అమర్ అనే వ్యక్తిని అతని తండ్రి ఇర్ఫాన్ పబ్జీ అడొద్దు అంటూ మందలించాడు. ప్రతిసారి అలా అడ్డుచెప్పడంతో విసుగుచెందిన అమర్ అతని తండ్రిపై విచక్షణా రహితంగా దాడి చేసి అతని గొంతు వద్ద అనేకసార్లు కత్తితో దాడి చేశాడు. అనంతరం అతను కూడా కత్తితో పొడుచుకున్నాడు.
ఇంటి నుంచి బయటకు రక్తపు మరకలతో వచ్చిన అతడిని రక్షించడానికి స్థానికులు ప్రయత్నించిన వారిపై కూడా దాడి చేయబోయాడు. గాయపడిన తండ్రి కొడుకులను ఆసుపత్రిలో చేర్పించారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే అమర్‌కు డ్రగ్స్ అలవాటు ఉందని అతని కుటుంబ సభ్యులు తెలియజేశారు. కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. భారత్‌లో పబ్జీని ఆపేసినప్పటికి ఇప్పటికే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారు ఆడటానికి వీలు కల్పిస్తుండంటతో యువత పబ్జీకి బానిసలుగా మారుతున్నారు. చదవండి: పబ్‌జీ ముసుగులో బాలికపై దారుణం