సెలవులో ఉన్న జవాను కిడ్నాప్!

శ్రీనగర్ : ఈద్‌ను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడానికి జమ్ము కశ్మీర్‌లోని సోఫియాన్‌కు వెళ్లిన జవాను ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయారు. జవానుకు చెందిన దగ్ధమైన కారును కుల్గామ్ జిల్లాకు సమీపంలోని రంభమా ప్రాంతంలో ఆర్మీ అధికారులు గుర్తించారు. 162వ బెటాలియన్‌కు చెందిన శిఖర్ మంజూర్ సెలవులో ఉన్నారు. జవానును ఉగ్రవాదులే కిడ్నాప్ చేసినట్టుగా ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
విధుల్లోలేని జవానులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు 2017లో సెలవుపై సోఫియాన్ వెళ్లిన లెఫ్ట్‌నెంట్ ఉమర్ ఫయాజ్‌ను కిడ్నాప్ చేసి ఉగ్రవాదులు హత్య చేశారు. 2018 జూన్‌లో ఈద్‌కు పూంచ్ వెళ్లిన ఔరంగజేబ్ అనే జవానును ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి హత్య చేశారు.
మరిన్ని వార్తలు