‘ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణమైన ఆహారం’ ఉత్పత్తి అయ్యేలా చూడాలన్న నిర్ణయానికొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ‘ప్రజలు తినే ఆహారం ΄పౌష్టిక విలువలతో కూడిన ఔషధం’గా ఉండేలే గాని, వారిని అనారోగ్యం పాలు చేసే విధంగా ఉండకూడదని లక్ష్యంగా పెట్టుకొంది. ఇందుకోసం ‘సేహత్’ (సైన్స్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ త్రూ అగ్రికల్చరల్ ట్రాన్స్‌ఫార్మేషన్– ఎస్‌ఈహెచ్‌ఏటీ) పేరిట ప్రత్యేక మిషన్ ప్రారంభమైంది.
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్), భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)లు ‘సేహత్ మిషన్’ను సంయుక్తంగా అమలు చెయ్యనున్నాయి. వ్యవసాయం, పౌష్టికత, ప్రజల ఆరోగ్యం మధ్య సమన్వయం సాధించటానికి సేహత్ మిషన్ దోహదపడుతుంది.
దేశం పోషకాహార లోపం, పెరుగుతున్న జీవనశైలి రుగ్మతలు అనే రెండు సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో సేహత్ మిషన్ ప్రారంభమైంది. సమీకృత సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలు, తోటలు, కోళ్లు, పశువుల పెంపకాన్ని ప్రోత్సహిస్తారు.
ఇదీ చదవండి: రీవాల్యుయేషన్ వివాదం : ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న సీబీఎస్‌ఈ
సరైన ఆహారపు అలవాట్లు, పంటల ఎంపిక, ఆరోగ్యదాయకమైన పశు పోషణకు సరైన శాస్త్రీయ పద్ధతులను వర్తింపజేస్తుంది. తద్వారా అనారోగ్యాలను నివారించడంలో, వ్యాధుల నిర్వహణకు తోడ్పడటంలో, తద్వారా ఔషధంగా పనిచేయడంలో ఆహారం ΄పోషించే పాత్రను ఈ మిషన్ నొక్కి చెబుతుంది.
ఇదీ చదవండి: షాకింగ్ ఘటన : మృత్యువు ఇలా కూడా..!


