Karnataka Horrific Accident: Biker Crash Into Oncoming Car, Video Viral - Sakshi
Sakshi News home page

వీడియో: హెల్మెట్‌ లేదు, పైగా నిర్లక్ష్యంగా ఓవర్‌టేక్‌ చేయబోయి..

Apr 1 2023 9:48 AM | Updated on Apr 1 2023 11:26 AM

Reckless overtaking lands Karnataka biker in Hospital - Sakshi

ఒళ్లు గగుర్పొడిచే రీతిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఇప్పుడు.. 

క్రైమ్‌: కర్ణాటకలో ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్లక్ష్యంగా తన ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయిన ఓ బైకర్‌ ఘోరంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో బైక్‌ తుక్కు తుక్కు కాగా, తీవ్ర గాయాలతో అతను ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. 

కర్ణాటక ముద్బిద్రిలో ఆల్వా కాలేజీ దగ్గర గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూల్‌లోంచి బస్సు బయటకు రాగా.. ఆ వెనకాలే వస్తున్న బైకర్‌, బస్సును ఓవర్‌ టేక్‌ చేయబోయాడు. ఇంతలో మరో పక్క నుంచి కారు దూసుకువచ్చింది. బైకర్‌ను బలంగా ఢీ కొట్టి కారు దూసుకెళ్లింది. బైక్‌ ఎత్తులో ఎగిరి తునాతునకలై దూరంగా పడిపోగా.. అతను రోడ్డు మధ్యలో పడిపోయాడు. 

కదలకుండా పడిపోయిన అతన్ని స్థానికులు కొందరు పక్కకు తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. నిర్లక్ష్యంగా ఓవర్‌ టేక్‌ చేయడమే కాదు.. కనీసం హెల్మెట్‌ కూడా పెట్టుకోలేదు ఆ బైకర్‌. సీసీటీవీ ఫుటేజీలో యాక్సిడెంట్‌ దృశ్యాలు నమోదు అయ్యాయి. 

Video Credtis: Mirror Now

Advertisement
 
Advertisement
Advertisement