‘హనీమూన్‌’ కేసు: సోనమ్‌ను ‘అక్కా’ అనేవాడు.. షాకిచ్చిన ప్రియుని సోదరి | Raj Kushwaha he Used to call Sonam Didi Raj Kushwahas sister | Sakshi
Sakshi News home page

‘హనీమూన్‌’ కేసు: సోనమ్‌ను ‘అక్కా’ అనేవాడు.. షాకిచ్చిన ప్రియుని సోదరి

Jun 11 2025 11:37 AM | Updated on Jun 11 2025 12:52 PM

Raj Kushwaha he Used to call Sonam Didi Raj Kushwahas sister

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన కొత్త జంట రాజారఘువంశీ, సోనమ్‌ల ‘హనీమూన్‌ కథ’ సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోనివిధంగా ఉంది.  జూన్ 2న మేఘాలయలోని ఒక లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమయ్యాక ఈ కథలో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. సోనమ్ తమ కుటుంబ వ్యాపార కార్యాలయంలో పనిచేసే రాజ్ కుశ్వాహాతో ఎప్పటి నుంచో ప్రేమలో ఉందని పోలీసుల విచారణలో తేలింది. 

రాజారఘువంశీ హత్యకు రాజ్ కుశ్వాహాతో పాటు అతని స్నేహితులు ఆకాష్, ఆనంద్, వికాస్‌లు సోనమ్‌కు సహకరించారని, ఇందుకు ‍ప్రతిగా సోనమ్ వారికి రూ. 20 లక్షలు  ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నదని పోలీసులు తెలిపారు. తాజాగా రాజ్ కుశ్వాహా సోదరి సుహానీ మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు నిర్దోషి అని, సోనమ్‌ను ‘దీదీ’ (అక్క) అని సంబోధించేవాడని, ఇంటిలో ఆఫీసుకు సంబంధించిన విషయాలు అంతగా మాట్లాడేవాడు కాదని తెలిపింది. సోనమ్‌ ప్రతీరోజూ ఉదయం అన్నయ్యకు ఫోన్ చేసేదని, ఆఫీసులో చేయాల్సిన పనుల గురించి చెప్పేదని సుహానీ తెలిపింది. తన అన్నయ్య సోనమ్‌ ఆఫీసులో రెండేళ్లు పనిచేశాడని చెప్పింది. 

మే 23న మేఘాలయలో రాజా రఘువంశీ హత్యకు గురైనప్పుడు తన సోదరుడు ఇండోర్‌లోనే ఉన్నాడని ఆమె పేర్కొంది. మే 11న జరిగిన సోనమ్ వివాహానికి తమ కుటుంబం నుండి ఎవరూ హాజరు కాలేదని సుహాని తెలిపింది. సోనమ్ వివాహ నిశ్చితార్థం తరువాత కూడా తన సోదరునిలో ఎటువంటి మార్పు చూడలేదని, అన్నయ్య  ఎటువంటి తప్పు చేయలేదని పేర్కొంది. ఈ హత్యలో సోనమ్‌ దీదీ ప్రమేయం గురించి తనకు తెలియదని సుహానీ తెలిపింది.

ఇది కూడా చదవండి: ప్రియాంకకు హైకోర్టు సమన్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement