డోంగర్‌ఘఢ్‌కు ప్రధాని మోదీ.. బమ్లేశ్వరి ఆలయంలో పూజలు | Sakshi
Sakshi News home page

డోంగర్‌ఘఢ్‌కు ప్రధాని మోదీ.. బమ్లేశ్వరి ఆలయంలో పూజలు

Published Sun, Nov 5 2023 12:19 PM

Prime Minister Narendra Modi Meeting with Acharya Vidyasagar Maharaj - Sakshi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) ఛత్తీస్‌ఘఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా ఆయన ఇప్పటికే డోంగర్‌ఘఢ్‌ చేరుకున్నారు. కొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ చంద్రగిరిలో ఆచార్య విద్యాసాగర్ మహరాజ్‌తో సమావేశమై, పలు అంశాలపై చర్చించనున్నారు. 

తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ముందుగా బమ్లేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. ఛత్తీస్‌ఘఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డోంగర్‌ఘడ్‌ స్థానం కీలకంగా మారింది. జైన మతానికి చెందిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాని మోదీ ఇక్కడ పర్యటన చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో స్థానికంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఆచార్య విద్యాసాగర్ మహరాజ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ  ఆసక్తికరంగా మారింది. 
ఇది కూడా చదవండి: కుండల తయారీలో కామర్స్‌ గ్రాడ్యుయేట్‌..

Advertisement
 
Advertisement
 
Advertisement