కారులో వెళ్తున్న ప్రధాని మోదీ.. యువతి చేతిలో ఆ ఫోటో చూడగానే.. ఒక్కసారిగా

Pm Narendra Modi Shimla Visit: Stops Car To Accept Portrait Of His Mother Shimla - Sakshi

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓ యువతి తన కళతో ఆకట్టుకుంది. ఎంతలా ఆంటే ఏకంగా ఆ యువతి కోసం ప్రోటోకాల్‌ని పక్కనబెట్టి తన దగ్గరకు వెళ్లి కాసేపు సంభాషించారు. వివరాల్లోకి వెళితే.. సిమ్లాలోని రిడ్జ్ మైదాన్‌కు వెళ్లే రహదారిలో ప్రధాని మోదీని చూసేందుకు వేచి ఉన్న ప్రేక్షకులతో  నిండిపోయింది. గుమిగూడిన ఆ జనం మధ్య, అను అనే అమ్మాయి ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీ చిత్రపటాన్ని పట్టుకుని నిలబడి ఉంది. 

ఈ విషయాన్ని గుర్తించిన ప్రధాని తన కారును ఆపి, హై సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి ఆమె దగ్గరకు వెళ్లి ఆ ఫోటోను స్వీకరించారు. అనంతరం.. "నీ పేరు ఏమిటి? ఎక్కడ నివసిస్తున్నారు? ఈ పెయింటింగ్ గీయడానికి ఎన్ని రోజులు పట్టింది? అని యువతిని ప్రశ్నించారు. అందుకు బదులుగా ఆ యువతి.. తాను సిమ్లావాసినని,  తానే స్వయంగా ఒక్కరోజులో ఈ చిత్రపటాన్ని పూర్తి చేసినట్లు ప్రధానికి తెలిపింది. యువతి పెన్సిల్‌ ఆర్ట్‌ను మోదీ అభినందించారు. 'గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్'లో పాల్గొనేందుకు ప్రధాని  మంగళవారం సిమ్లా చేరుకున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 10 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ప్రధాన మంత్రి ₹ 21,000 కోట్లు విడుదల చేశారు.

చదవండి: భారతి ‘స్వరాజ్‌’’పై ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top