తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు: మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు, ఉత్తరాంధ్ర బిడ్డ గిడుగు రామ్మూర్తి జయంతి. ఈ సందర్భంగా ప్రధాని నర్రేంద మోదీ.. ‘తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు. తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి ఈ రోజు నేను నివాళులు అర్పిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. (గొప్ప భాషోద్యమకారుడు గిడుగు రామ్మూర్తి: సీఎం జగన్)
మన్ కీ బాత్:
అదే విధంగా రేపు(ఆదివారం) మన్ కీ బాత్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 11గంటలకు జరనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ రేడియోలో మాట్లాడనున్నారు. జాతని ఉద్దేశించి ఆయన పలు అంశాలపై ప్రసంగించనున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి