
ఢిల్లీ: అన్నా చెళ్లెల్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు చిహ్నంగా దేశవ్యాప్తంగా రక్షబంధన్ జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా రాఖీ పండుగ కోసం ప్రజలు సిద్దమవుతున్నారు. కాగా, రక్షా బంధన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ఏడాది కూడా రాఖీ కట్టేందుకు ముస్లిం సోదరి ఖమర్ మొహ్సిన్ షేక్ ప్రత్యేక రాఖీని తయారు చేశారు. ఈ సందర్భంగా ఆమె తన ఆనందం వ్యక్తం చేశారు.
వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌లోని కరాచీలో 1981లో జన్మించిన ఖమర్ షేక్.. గుజరాత్‌కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడంతో భారత్‌లోనే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గత 30 సంవత్సరాలుగా తాను మోదీజీకి రాఖీ కడుతున్నట్టు తెలిపారు. ఆయన ప్రధాని అయ్యాక కూడా రాఖీ పంపిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ సంవత్సరం ఆమె తన చేతులతో ఓం, గణేష్ జీ డిజైన్లతో నాలుగు రాఖీలను తయారు చేసింది. రాఖీ కట్టేందుకు ఆమె పీఎంఓ ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
VIDEO | As Rakshabandhan approaches, Qamar Mohsin Sheikh, a Pakistani-origin woman living in Ahmedabad, is once again preparing to tie a handmade rakhi to Prime Minister Narendra Modi, continuing a unique tradition that has lasted around 30 years.
Every year, Sheikh crafts… pic.twitter.com/SMWi5iPyc6— Press Trust of India (@PTI_News) August 6, 2025
ఈ సందర్బంగా ఖమర్ మొహ్సిన్ షేక్ మాట్లాడుతూ..‘ప్రతి సంవత్సరం తాను స్వయంగా రాఖీలు తయారు చేస్తానని, తనకు అత్యంత ఇష్టమైన రాఖీని ప్రధాని మోదీ చేతికి కడతానని చెప్పారు. మోదీ సంఘ్ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి తనకు తెలుసునని ఆమె చెప్పింది. ఒకసారి ప్రధాని మోదీ తన క్షేమం గురించి అడిగి, ‘సోదరి ఎలా ఉన్నారు?’ అని ప్రశ్నించారు. అప్పటి నుంచి రాఖీలు కట్టడం ప్రారంభించినట్టు తెలిపారు. గతంలో మోదీజీ గుజరాత్ ముఖ్యమంత్రి కావాలని తాను ప్రార్థించినట్టు షేక్ చెప్పారు. అప్పుడు ఆయన నవ్వినట్టు తెలిపింది. అయితే, గత సంవత్సరం తాను ఢిల్లీకి వెళ్లలేకపోయానని, కానీ ఈ సంవత్సరం తనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం వస్తుందని, రాఖీ కట్టి రక్షాబంధన్ జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తన భర్తతో కలిసి మోదీని కలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు