చంపేస్తామన్న బెదిరింపు లేఖకి ఝలక్‌ ఇచ్చేలా..మోదీ రోడ్‌ షో

PM Modi Mega Roadshow In Kochi Differently From Other Roadshow - Sakshi

రెండు రోజుల కేరళ పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోదీని ఆత్మహుతి దాడి చేసి చంపేస్తామని వచ్చిన బెదిరింపు లేఖ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ లేఖ నేపథ్యంలో..మోదీ తన రోడ్‌షోలకు విభిన్నంగా కొచ్చిలో మెగా రోడ్‌ షో నిర్వహించారు. ఆయన కారుదిగి స్వయంగా కాలినడకన రోడ్‌ షో ప్రారంభించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ బెదిరింపు లేఖకి ఝలక్‌ ఇచ్చేలా రోడ్‌ షో చేశారు. ఈ మేరకు ఆయన కేరళ సంప్రదాయ దుస్తులు, కసావు ముండు, శాలువా, కుర్తా ధరించి రహదారికి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

దాదాపు రెండు కిలోమీటర్ల మేర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ భద్రత కోసం వేలాది మంది పోలీసులు మోహరించారు. ఇదిలా ఉండగా మళయాళంలో కొచ్చి నివాసి రాసినట్లు వచ్చిన లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌ కార్యాలయం అందుకున్నారు. ఆయనే పోలీసు చీఫ్‌కు ఈ లేఖను అందజేసినట్లు చెప్పారు కూడా. ఐతే పోలీసుల నుంచి లీక్‌ అయిన ఇంటిలిజెన్స్‌ రిపోర్ట్‌ని ఘోర తప్పిదమని మండిపడ్డారు.

దీన్ని కేంద్ర సహాయం మంతి మురళీధరన్‌ కూడా తీవ్రంగా ఖండించారు. ప్రధాని భద్రతా వివరాలు ఎలా వాట్సాప్‌లో లీక్‌ అయ్యి వైరల్‌ అయ్యిందనేది ముఖ్యమంత్రి వివరించాలన్నారు. దీని అర్థం హోం శాఖ కుదేలైందనే కదా అంటూ ఫైర్‌ అయ్యారు. కాగా, మోదీ కేరళ పర్యటలనో దాదాపు రూ. 3 వేల కోట్ల ‍ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు మోదీ కేరళలో బుధవారం తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభిస్తారు. అలాగే బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్‌ల ద్వారా కొచ్చి చుట్టుపక్కల ఉన్న 10 ద్వీపాలను కలిపే ఒక రకమైన ప్రాజెక్ట్ అయిన కొచ్చి వాటర్ మెట్రోను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

(చదవండి: 'బీజేపీ జీరో కావాలన్నదే నా కోరిక’)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top