సీఎంలతో ముగిసిన మోదీ సమావేశం | PM Modi meets CMs amid Iran war | Sakshi
Sakshi News home page

సీఎంలతో ముగిసిన మోదీ సమావేశం

Mar 27 2026 6:13 PM | Updated on Mar 28 2026 12:33 PM

PM Modi meets CMs amid Iran war

ఢిల్లీ: దేశంలోని రాష్ట్రాలు, ‍కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. సుమారు రెండున్నరగంటల పాటు చర్చలు కొనసాగాయి. 

పశ్చిమాసియా యుద్ధం వేళ ఇంధన సంక్షోభం, తదితర అంశాలపై చర్చించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఫర్టిలైజర్స్ సప్లైకి ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. దీనిలో భాగంగా పీఎం మోదీ మాట్లాడుతూ.. కలిసికట్టుగా పని చేస్తేనే పరిస్థితులను అధిగమించవచ్చన్నారు. ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కాపాడుకోవడమే ప్రాధాన్యమని, ప్రజాప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా అంతా పని చేయాలన్నారు. 

ఎక్సైజ్‌ సుంకం తగ్గించి ప్రజలపై భారం పడకుండా చేశామని, బ్లాక్‌ మార్కెటింగ్‌ను నిరోధించాలని సీఎంలకు సూచించారు. ఎరువుల నిల్వ, పంపిణీపై ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేయాలని రాష్ట్ర సీఎంలకు మోదీ ఆదేశించారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement