రూ.400 కోట్లకు పైగా నగదు స్వాధీనం | ECI Seizes Over Rs 400 Crores Across Poll Bound States | Sakshi
Sakshi News home page

ఎన్నికల బరిలో.. నోట్ల సిరి!

Mar 27 2026 1:10 PM | Updated on Mar 27 2026 1:30 PM

ECI Seizes Over Rs 400 Crores Across Poll Bound States

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం వేళ అక్రమ నగదు, మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉక్కుపాదం మోపుతోంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రలోభాలకు తావులేకుండా ఈసీ కఠిన చర్యలు చేపట్టింది.

ఫిబ్రవరి 26న ఎల్రక్టానిక్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఈఎస్‌ఎంఎస్‌) పేరిట ఎన్నికల నిఘా వ్యవస్థను క్రియాశీలకం చేసింది. నాటి నుంచి మార్చి 25 వరకు కొద్దిరోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.408.82 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మొత్తంలో మాదకద్రవ్యాల విలువ రూ.167 కోట్లకు పైగా ఉండటం గమనార్హం. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న అక్రమ సొత్తును ఈసీ గణాంకాలతో సహా వెల్లడించింది.  

100 నిమిషాల్లోనే పరిష్కారం... 
ఎన్నికల అక్రమాలపై సామాన్య పౌరులు ఫిర్యాదు చేసేందుకు తీసుకొచ్చిన ‘సి–విజిల్‌’ (cVIGIL) యాప్‌కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని ఈసీ తెలిపింది. మార్చి 15 నుంచి 25 మధ్య కేవలం పది రోజుల్లోనే 70,944 ఫిర్యాదులు అందాయి. ఇందులో 95.8 శాతం (67,899) ఫిర్యాదులను కేవలం 100 నిమిషాల వ్యవధిలోనే పరిష్కరించారు. 1950 కాల్‌ సెంటర్‌ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని ఈసీ పేర్కొంది. 

చ‌ద‌వండి: ఎన్నిక‌ర ప్ర‌చార ఖ‌ర్చుతో 100 ఇళ్లు నిర్మించిన కేర‌ళ నేత‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement