అట్టహాసంగా అయోధ్యలో దీపావళి వేడుకలు... హాజరుకానున్న మోదీ

PM Modi Expected To Visit Ayodhya Ram Temple On Sunday - Sakshi

న్యూఢిల్లీ: దీపావళి వేడుకలో యావత్‌ భారత్‌ ఆందహేళిలో మునిగితేలే ఒక రోజు ముందు కూడా దీపోత్సవ వేడుకలు పలు చోట్ల జరుగుతుంటాయి. ఈసారి అయోధ్యలో దీపావళి వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు ఒక రోజుముందు అనగా... అదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా అయోధ్యలోని దీపోత్సవ వేడుకల సన్నహాలను పరిశీలించేందుకు బుధవారం పవిత్ర నగరాన్ని సందర్శించనున్నారని సమాచారం.

ఆయన రామాలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత ప్రధాని మోదీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రాని పరిశీలిస్తారని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి కొత్తగా నిర్మిస్తున్న భారీ రామాలయాన్ని సందర్శించనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. షెడ్యూల్‌ప్రకారం ఆయన రామలీలా పాత్రలను వేసేవారిని స్వాగతించేందుకు రామ్‌ కథా పార్కును కూడా సందర్శించే అవకాశం ఉందంటున్నారు.

మరోవైపు రామమందిర నిర్మాణ కమిటీ రెండు రోజుల సమీక్షా సమావేశం ముగియడంతో ట్రస్ట్‌ సభ్యలు మీడియాతో మాట్లాడుతూ...రామమందిర నిర్మాణ పనులు దాదాపు 50శాతం జరిగాయని పేర్కొన్నారు. అలాగే ఆదివారం ప్రారంభమయ్యే మూడు రోజుల దీపోత్సవ వేడుకల్లో రష్యా, మలేషియా, శ్రీలంక, ఫిజీ దేశాలకు చెందిన కళాకారుల రాంలీలా ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలవడమే గాక ఆవుపేడతో తయారు చేసిన దాదాపు 17 లక్షల మట్టి దీపాలను వెలగించి రికార్డు సృష్టించనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు సరయునది వద్ద గ్రీన్‌ డిజిటల్‌ బాణసంచా కాల్చేందుకు ఏర్పాట్లు కూడా చేసినట్ల తెలిపారు.

(చదవండి: విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి....)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top