మతం చూడం.. కులం చూడం.. అదే సిసలైన లౌకికవాదం: ప్రధాని మోదీ

PM Modi Define True Secularism - Sakshi

గాంధీనగర్‌: అసలైన లౌకికవాదం అంటే.. తన దృష్టిలో వివక్ష లేకపోవడమేనని గుజరాత్‌ పర్యటనలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే వారికి నేను చెప్పదల్చుకుంది ఒక్కటే. ప్రజల సంతోషం, వాళ్ల సౌలభ్యం.. పూర్తిస్థాయి హక్కుల కోసం పని చేయడం కన్నా గొప్ప సామాజిక న్యాయం మరొకటి లేదని తాను భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం దేశం కూడా అదే తోవలో పయనిస్తోందని అన్నారాయన

శనివారం గాంధీనగర్‌(గుజరాత్‌) మహాత్మా మందిర్‌లో సుమారు 4 వేల కోట్ల రూపాయలకుపైగా ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. సంక్షేమం అందించడంలో తన ప్రభుత్వం పక్షపాతం లేకుండా వ్యవహరిస్తుదందని చెప్పారు. నా దృష్టిలో సెక్యులరిజం అంటే.. వివక్ష లేకపోవడమే. అందుకే కులం, మతం అనే పట్టింపు లేకుండా వివిధ పథకాల రూపంలో లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను మా ప్రభుత్వం అందిస్తోంది. ఇలా అందరి సంతోషం, సౌలభ్యం కోసం పని చేసినప్పుడు.. అంతకు మించిన సామాజిక న్యాయం మరొకటి ఉండబోదని చెప్పారాయన. 

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద.. గుజరాత్‌లో నిర్మిస్తున్న నివాస సముదాయాలకు శంకుస్థాపన చేశారాయన.  ఈ పథకం కింద.. పేదల కోసం నాలుగు కోట్ల నివాసాలు నిర్మించామని, అందులో 70 శాతం నివాసాలను మహిళలకు అందజేయడం ద్వారా మహిళా సాధికారికతను చాటామని తెలిపారాయన.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top