రైతుల గెలుపే మొదటి ప్రాధాన్యత

Navjot Singh Sidhu Raises Issues Of Farmers Protest - Sakshi

చండీగఢ్‌: కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాల రద్దే లక్ష్యంగా నిరసనలు చేస్తున్న రైతన్నల విజయమే తన మొదటి ప్రాధాన్యమని పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ తెలిపారు. నిరసనలు చేస్తున్న రైతులు తనను ఆహ్వానిస్తే వారి వద్దకు చెప్పులు లేకుండా వారి వద్దకు వెళతానని వ్యాఖ్యానించారు.

ఏడాది నుంచి జరుగుతున్న రైతు నిరసనలు ఎంతో పవిత్రమైనవని అందువల్ల సంయుక్త కిసాన్‌ మోర్చా విజయం తనకు ముఖ్యమని పేర్కొన్నారు. శనివారం ఆయన చమ్‌కౌర్‌ సాహిబ్‌ వద్ద మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతన్నల కోసం ఏం చేయగలదో చెబుతామని అన్నారు. పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న దిగుబడి ప్రస్తుత నిరసనలకు కారణమైందని అన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top