తమ ఛానల్‌ చూడాలని డబ్బు పంపిణీ

Mumbai Police Notice To Fake TRP Rating Channels - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నకిలీ టీర్పీ రేటింగ్స్‌ పొందుతూ అక్రమాలకు పాల్పడుతున్న టీవీ రేటింగ్స్‌ స్కాంను ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. జనాలకు డబ్బులిచ్చి, తమ ఛానల్‌ మాత్రమే చూడాలని మీటర్స్‌ను అమర్చి అక్రమంగా రేటింగ్స్‌ పెంచుకుంటున్న ఛానల్స్‌ను పోలీసులు గుర్తించారు. విధంగా అక్రమాలకు పాల్పడుతున్న ఛానల్స్‌లో ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మహారాష్ట్రకు చెందిన మరో రెండు ఛానల్స్‌  ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గురువారం ముంబైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరయ్‌ బీర్‌ సింగ్‌.. టీవీ రేటింగ్స్‌ స్కాం వివరాలను గురువారం వెల్లడించారు.

బార్క్‌ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు ఫేక్‌ టీర్పీ రేటింగ్‌ వివరాలు తెలిశాయని తెలిపారు. దీనిలో బార్క్‌ మాజీ ఉద్యోగులతో పాటు మరికొంత మంది ప్రముఖులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఛానల్‌ మాత్రమే చూస్తామన్నవారికి ఉచిత టీవీతో పాటు కొంత నగదును సైతం అందిస్తారని పేర్కొన్నారు. తాజా స్కాంతో సంబంధముందని అనుమానిస్తున్న ఇద్దరు మరాఠీ టీవీ యజమానులను పోలీసులు అరెస్ట్‌ చేయగా.. మరికొంతమందికి నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారం టెలివిజన్‌తో పాటు, రాజకీయంగాను చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ స్కాంలో జాతీయ మీడియాకు చెందిన ఓ ప్రముఖ ఛానల్‌ యజమాని కూడా ఉన్నాడని సమాచారం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top