21వ శతాబ్దం మహిళలదే.. మోదీ | Modi participates in the special session on the Women's Reservation Bill | Sakshi
Sakshi News home page

21వ శతాబ్దం మహిళలదే.. మోదీ

Apr 13 2026 12:05 PM | Updated on Apr 13 2026 12:44 PM

Modi participates in the special session on the Women's Reservation Bill

ఢిల్లీ: 21 శతాబ్దంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయాలలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రధానమైనదని ప్రధాని మోదీ అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ఢిల్లీలో నిర్వహించిన నారీ శక్తి వందన్ సమ్మేళనంలో మోదీ పాల్గొన్నారు. ఏప్రిల్‌ 16న పార్లమెంటు ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు రానుందని తెలిపారు. 21 వ శతాబ్దం మహిళలదేనని మహిళా సాధికారిత దిశగా ముందుకెళ్తున్నామన్నారు.

మహిళ సాధికారిత దిశగా అడుగువేస్తున్నామని దేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళల రిజర్వేషన్ బిల్లు అతిపెద్ద నిర్ణయమని తెలిపారు. కేంద్రం తీసుకునే ఈ కీలక నిర్ణయాన్ని మహిళలకే అంకితం చేయబోతున్నామన్నారు. 2023 నుంచి ఈ బిల్లుకు అన్ని పక్షాలు మద్దతిస్తున్నాయని కొత్త చరిత్రను లిఖించేందుకు పార్లమెంటు సిద్ధంగా ఉందని అందుకోసమే మహిళల రిజర్వేషన్ల కోసం పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం అవుతుందని మోదీ అన్నారు.

సుదీర్ఘ కాలం తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు ముందుకు వస్తుందని ప్రతి పార్టీ దీనిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. దేశాభివృద్దిలో మహిళలదే కీలకపాత్రన్నారు. పంచాయిత్ నుంచి పార్లమెంటుకు వచ్చేందుకు వారికి మార్గం సుగమం అయ్యిందన్నారు. 2029లో మహిళా కోటా అమలు చేస్తామన్నారు. మహిళల భాగస్వామ్యంతో వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని మోదీ ఆశాబావం వ్యక్తం చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement