MK Stalin: కరోనా ఉగ్రరూపం.. సీఎం స్టాలిన్‌ నడిరోడ్డుపై కారు ఆపి..

MK Stalin Stops Car, Distributes Masks To Violators In Chennai - Sakshi

చెన్నై: కరోనా వైరస్‌ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతున్న విషయం తెలిసిందే. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ రూపంలో మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తన పంజా విసురుతోంది. భారత్‌లోనూ కరోనా కేసులు ఉదృతంగా నమోదవుతున్నాయి.  కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారింది. మాస్క్‌ ధరించకుండా బయకటు వచ్చిన వారికి పోలీసులు ఫైన్ కూడా విధిస్తున్నారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకేస్టాలిన్‌ మంగళవారం చెన్నై వీధుల్లో మాస్కులు పంపిణీ చేస్తూ కనిపించారు.

చదవండి: (28 రోజులుగా కోమాలో.. వయాగ్రా అధిక మొత్తంలో ఇవ్వడంతో..)

రాష్ట్రం‍లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. సీఎం స్టాలిన్‌ మంగళవారం పార్టీ కార్యాలయం నుంచి క్యాంపు కార్యాలయానికి తిరిగి వెళ్తుండగా, కొంతమంది బహిరంగంగా మాస్కులు ధరించకపోవడాన్ని గమనించారు. వెంటనే రోడ్‌ పైనే కారు ఆపిన సీఎం.. స్థానికంగా ఉన్న వారికి స్వయంగా మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా అందరూ మాస్క్‌లు ధరించాలంటూ సీఎం స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎం స్టాలిన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇందులో  ముఖ్యమంత్రే  కొందరికి మాస్క్‌ పెడుతూ కనపడుతున్నారు.

చదవండి: (యువతిపై అత్యాచారం, హత్య.. కట్టెల కోసమని అడవిలోకి వెళ్లగా..)

కాగా దేశంలో రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తమిళనాడులోనూ కోవిడ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో సంక్రాంతి పండుగ అత్యంత కీలకం కావడంతో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రభుత్వం పలు ఆంక్షలను కూడా విధించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top