అర్ధరాత్రి చెత్త వేయడానికి వెళ్లి... ప్రియుడితో పరార్! | Married Woman Flee With Boyfriend In Bengaluru, Husband Files Police Complaint, More Details Inside | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి చెత్త వేయడానికి వెళ్లి... ప్రియుడితో పరార్!

Apr 23 2026 11:46 AM | Updated on Apr 23 2026 1:03 PM

 Married Woman Flee With Boyfriend In Bengaluru

యశవంతపుర( కర్ణాటక):  భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో ఉడాయించిన భార్య ఉదంతం బెంగళూరు బాగలగుంటె పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. ప్రియాంక, శరత్‌కుమార్‌ అనే దంపతులు బాగలగుంటలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. శరత్‌ పనులకు వెళ్లిన సమయంలో ప్రియాంక కటింగ్‌ షాపు నిర్వహిస్తున్న ప్రభు వద్దకు వెళ్లి మాట్లాడేది. 

ఇదే విషయంపై ప్రయాంక, శరత్‌ల మధ్య గొడవ జరిగేది. ఈ నెల 11న అర్ధరాత్రి సమయంలో ఇంటిలోని చెత్తను తీసుకోని చెత్తకుండీలో వేసేందుకు వెళ్లిన ప్రియాంక తిరిగి రాలేదు. శరత్‌ బయటకు వెళ్లి ఆరా తీయగా ప్రభు బైక్‌పై ప్రియాంక  వెళ్తున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భోజనంలో తనకు నిద్రమాత్రలు కలిపిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.   

 

 

Advertisement
 
Advertisement
Advertisement