అభిషేక్ బెనర్జీపై దాడి.. మమతా ఘాటు రియాక్షన్ | mamata anerjee bjp on abhishek banerjee assault rulers became killers | Sakshi
Sakshi News home page

అభిషేక్ బెనర్జీపై దాడి.. మమతా ఘాటు రియాక్షన్

May 30 2026 11:02 PM | Updated on May 30 2026 11:42 PM

mamata anerjee bjp on abhishek banerjee assault rulers became killers

కోల్‌కతా: ఈ రోజు పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తృణముల్ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ అభిషేక్‌పై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ స్పందించారు.  

సోనార్‌పూర్‌లో ఈరోజు (శనివారం) మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, అభిషేక్ బెనర్జీ పర్యటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతర హింస చెలరేగింది. అందులో  బాధితులైన తృణముల్  పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడానికి అభిషేక్ బెనర్జీ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో ఆయనపై కొంతమంది గుర్తుతెలియన వ్యక్తులు దాడి చేశారు. కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన మమతా ""పాలకులే హంతకులుగా మారారు.. సిగ్గుపడాలి బీజేపీ" అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ ఘటనపై బీజేపీ స్పందించింది. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య స్పష్టం చేశారు. అదే విధంగా దాడిని ఖండిస్తున్నామన్నారు.  గత 15 ఏళ్లుగా టీఎంసీ సాగించిన పాలనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని అందుకే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురైందన్నారు.

అయితే ఆ దాడి సమయంలో అభిషేక్‌ బెనర్జీ తనకు రాళ్లు, గుడ్లు తగలకుండా హెల్మెట్‌ పెట్టుకున్నారు. ఈ ఘటన సమయంలో నిరసనకారులు “చోర్ చోర్” అంటూ నినాదాలు చేశారు. అభిషేక్ బెనర్జీ రాకను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement